
హేమంత్ హత్య కేసులో నిందితులుగా ఉన్నవారందరినీ కఠినంగా శిక్షించాలని అతని భార్య అవంతి బుధవారం సజ్జనార్‌ను కలిశారు. ఆమెతో పాటు హేమంత్ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా తనకు ప్రాణహాని ఉందని అవంతి సీపీ సజ్జనార్‌కు తెలిపింది. హేమంత్ హత్యకు మందు, ఆ తరువాత జరిగిన పరిణామాలను అవంతి సజ్జనార్‌కు వివరించారు. ఈ సందర్భంగా వినతి పత్రాన్ని కూడా అందించారు. కాగా నిందితులకు కఠినంగా శిక్ష వేయాలని అవంతి అంతకుముందు నుంచే డిమాండ్ చేస్తోంది. ఈ తరుణంలో సీపీ సజ్జనార్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది.