కరోనాలో మరో కొత్త లక్షణం.. నిమిషాల్లో చంపేస్తుందట..?

దేశంలో నెలలు గడుస్తున్నా కరోనా మహమ్మారి ఉధృతి ఆగడం లేదు. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా 50,000కు అటూఇటుగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. వైరస్ ఉధృతిని అదుపు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా ఆ చర్యలు ఫలితాన్ని ఇవ్వడం లేదు. తాజాగా కరోనా మహమ్మారి గురించి మరో కొత్త లక్షణం వెలుగులోకి వచ్చింది. ఈ మహమ్మారి గుండె కండరాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని తేలింది. గుండె కండరాలపై వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటే హృదయ […]

Written By: Navya, Updated On : November 2, 2020 7:29 pm
Follow us on


దేశంలో నెలలు గడుస్తున్నా కరోనా మహమ్మారి ఉధృతి ఆగడం లేదు. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా 50,000కు అటూఇటుగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. వైరస్ ఉధృతిని అదుపు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా ఆ చర్యలు ఫలితాన్ని ఇవ్వడం లేదు. తాజాగా కరోనా మహమ్మారి గురించి మరో కొత్త లక్షణం వెలుగులోకి వచ్చింది. ఈ మహమ్మారి గుండె కండరాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని తేలింది.

గుండె కండరాలపై వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటే హృదయ సంబంధిత వ్యాధుల వల్ల నిమిషాల్లో చనిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఊపిరితిత్తులపైనే వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పిన శాస్త్రవేత్తలు ప్రస్తుతం ఊపిరితిత్తులతో పాటు గుండెపై కూడా వైరస్ ప్రభావం చూపుతోందని వెల్లడిస్తున్నారు. గుండెకు తగిన మోతాదులో ఆక్సిజన్ అందకుండా చేసి రక్తం గడ్డ కట్టే ప్రమాదాన్ని పెంచుతోందని తెలిపారు.

హృదయం శరీరంలోని అన్ని భాగాలను రక్తాన్ని సరఫరా చేస్తుంది. రక్త సరఫరా సరిగ్గా జరిగితే మాత్రమే శరీరంలోని ఇతర అవయవాలు సక్రమంగా పని చేస్తాయి. రోజురోజుకు కరోనా మహమ్మారి గురించి కొత్త లక్షణాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం మినహా మరో మార్గం లేదని.. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.

క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే కరోనా సోకినా త్వరగా కోలుకునే అవకాశాలు ఉంటాయని తెలుపుతున్నారు. సిగరెట్లు, మద్యం లాంటి చెడు అలవాట్లకు ఎంత దూరంగా ఉంటే కరోనా సోకే అవకాశాలు అంత తక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.