సోనూసూద్ వృత్తి పరంగా నటుడు. ప్రవృత్తి పరంగా సమాజ సేవకుడు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సోనూ సూద్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రవాసీ రోజ్గార్ అనే వెబ్సైట్ ద్వారా వలస కార్మికులకు ఉపాధి చూపించారు. సోనూసూద్ ఇప్పుడు సాయానికి మారుపేరులా మారిపోయాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం బాలీవుడ్ న్యూస్
ఎవరికి ఆపద వచ్చిన వెంటనే స్పందిస్తూ వారికి సాయం చేస్తున్నాడు. లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికులను వారి ఇంటికి పంపించి మానవత్వాన్ని చాటుకున్నాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఒక రైతుకు ట్రాక్టర్ కొనిచ్చాడు. ఇవి మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో సాయాలు చేస్తున్నాడు. ఇప్పుడు మరో గొప్ప ప్రయత్నానికి తెరతీశాడు.
తమ పిల్లలకు ఉన్నత విద్యనందించడానికి అణగారిన వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను సోనూ ఇటీవల గమనించాడు. దీంతో ఇప్పుడు వారిని ఆదుకునేందుకు రంగంలోకి దిగాడు. వారందరి కోసం ఓ ప్రత్యేక స్కాలర్‌షిప్ప్రోగ్రాం రెడీ చేశాడు. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న అణగారిన వర్గాల విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఇస్తానని గతంలోనే ప్రకటించి పేద విద్యార్థుల పాలిట కల్పతరువుగా మారారు.
Also Read: రాజమౌళి విలన్ ఇండియాలోకి అడుగుపెట్టింది
తాజాగా సోమవారం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న హైదరాబాద్ బాలికకు అండగా నిలిచారు. గుండె జబ్బుతో బాధపడుతున్న బాలికకు సర్జరీ చేయిస్తానని సోనూసూద్ తాజాగా హామీ ఇచ్చాడు.
హైదరాబాద్ హఫీజ్ పేటకు చెందిన తేజశ్రీ(12)కి గుండె సంబంధిత వ్యాధి ఉంది. ఇప్పటికే రూ.12 లక్షలు అప్పు చేసి చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. అప్పులపాలైన తల్లిదండ్రులు చివరకు సోనూసూద్ శరణు వేడారు. బాలిక తల్లిదండ్రులు ఈరోజు మొయినాబాద్ లో షూటింగ్ కోసం వచ్చిన సోనూను కలిసి సమస్య వివరించారు.
Also Read: పీవీ సింధూ రిటర్ మెంట్.. ట్విస్ట్ ఇచ్చిందిలా!
దీనికి స్పందించిన సోనూ సూద్ బాలిక వైద్య ఖర్చులు భరిస్తానని హామీ ఇచ్చాడు. ఆ పేద కుటుంబానికి ఆనందం పంచి బాలిక బతుకు మీద ఆశలు కల్పించాడు.