https://oktelugu.com/

రాజమౌళి విలన్ ఇండియాలోకి అడుగుపెట్టింది

ఎస్.ఎస్.రాజమౌళి తన సినిమాల్లో పాత్రలను ఎంత పకడ్బంధీగా రాసుకుంటారో ఆ పాత్రలోకి నటీ నటుల్ని కూడ అంతే జాగ్రత్తగా ఎంచుకుంటారు. ఇప్పటి వరకు రాజమౌళి తన పాత్రల కోసం ఎంపిక చేసుకున్న నటులు సరిపోలేదు, సరిగ్గా కుదరలేదు అనే విమర్శలు రాలేదంటే ఆయన సెక్షన్ ఎంత పర్ఫెక్ట్ అనేది అర్థం చేసుకోవచ్చు. ‘బాహుబలి’ సినిమాలోని పాత్రలు అంత గొప్పగా ఎలివేట్ కాగలిగాయి అంటే కారణం ఆ పాత్రకు సరిపడా నటుల్ని రాజమౌళి ఎంచుకోవడమే. ప్రస్తుతం చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : November 2, 2020 / 07:14 PM IST
    Follow us on


    ఎస్.ఎస్.రాజమౌళి తన సినిమాల్లో పాత్రలను ఎంత పకడ్బంధీగా రాసుకుంటారో ఆ పాత్రలోకి నటీ నటుల్ని కూడ అంతే జాగ్రత్తగా ఎంచుకుంటారు. ఇప్పటి వరకు రాజమౌళి తన పాత్రల కోసం ఎంపిక చేసుకున్న నటులు సరిపోలేదు, సరిగ్గా కుదరలేదు అనే విమర్శలు రాలేదంటే ఆయన సెక్షన్ ఎంత పర్ఫెక్ట్ అనేది అర్థం చేసుకోవచ్చు. ‘బాహుబలి’ సినిమాలోని పాత్రలు అంత గొప్పగా ఎలివేట్ కాగలిగాయి అంటే కారణం ఆ పాత్రకు సరిపడా నటుల్ని రాజమౌళి ఎంచుకోవడమే. ప్రస్తుతం చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం కూడ రాజమౌళి అదే ఫాలో అవుతున్నారు.

    Also Read: తగ్గనంటున్న రాజమౌళి.. స్టార్ హీరోల అభిమానుల్లో టెన్షన్..?

    ప్రధాన పాత్రల కోసం దిగ్గజ నటీనటుల్ని ఎంపిక చేశారు. అజయ్ దేవగన్, ఒలీవియా మోరిస్, సముథిర ఖని తరహాలోనే లీయే స్కాట్ అనే ముఖ్యమైన పాత్ర కోసం ఐరిష్ నటి అలిసన్ డూడీని తీసుకున్నారు. అలిసన్ డూడీ హాలీవుడ్లో పలు పెద్ద సినిమాల్లో నటించింది. ఈమె పాత్ర సినిమాలో ప్రతినాయిక పాత్రని అంటున్నారు. ఇప్పటికే ఆమె షూటింగ్లో పాల్గొనాల్సిఉండగా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. ఇప్పుడు లాక్ డౌన్ సడలించడంతో ఆమె ఇండియా బయలుదేరారు.

    Also Read: ‘ఆర్ఆర్ఆర్’ రచ్చ.. రాజమౌళి మౌనం వీడాల్సిందేనా?

    తన ఇన్స్టా అకౌంట్లో లేడీ స్కాట్ ఇండియాకు వస్తోంది అంటూ పోస్ట్ పెట్టింది ఆమె. అంటే త్వరలోనే ఆమె షూటింగ్లో జాయిన్ కానున్నారన్నమాట. మరి ఆమెను లేడీ ప్రతినాయికగా రాజమౌళి ఎలా ప్రెజెంట్ చేసి ఉంటారో చూడాలి. ఇకపోతే చరిత్రలో అసలు సంబంధమే లేని అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ కలుసుకుని ఒకరినొకరు ప్రభావితం చేసుకుంటే ఎలా ఉంటుంది, వారి మానసిక స్థితిగతులు ఎలా ఉండేవి అనే ఫిక్షనల్ కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఈ సినిమా కోసం సుమారు 300 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారు నీమాట దానయ్య. వచ్చే ఏడాదిలో చిత్రం విడుదలకానుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్