
దేశంలో కరోనా మహమ్మారి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్న సంగతి తెలిసిందే. మరికొన్ని రోజుల్లో కేసుల సంఖ్య భారీగా తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తుండటం గమనార్హం. కరోనా సోకిన వాళ్లలో 80 శాతానికి పైగా రోగులు ఇంటి నుంచే కోలుకుంటూ ఉండటం గమనార్హం. కరోనా నిర్ధారణ అయినంత మాత్రాన ఆస్పత్రిలో మాత్రమే చికిత్స తీసుకోవాల్సిన అవసరం లేదు. కేసుల సంఖ్య తగ్గుతుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా తగ్గుతోంది.
అయితే కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వాళ్లను ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వేధిస్తూ ఉండటం గమనార్హం. స్టిరాయిడ్లు వాడిన వారిలో కొంతమంది బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నట్టు తెలుస్తోంది. కరోనా నుంచి కోలుకున్న వారిలో కొంతమందిలో షుగర్ నిర్ధారణ అవుతోంది. ఇప్పటికే గుర్తించిన వ్యాధులకు తోడుగా కరోనా నుంచి కోలుకున్న వాళ్లను మరో సమస్య వేధిస్తుండటం గమనార్హం. ఈ సమస్యను బోన్ డెత్ అని పిలుస్తారు.
కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో ముగ్గురు బాధితులు ఈ సమస్యతో ముంబైలో ఉన్న హిందూజా ఆస్పత్రిలో చేరారు. ఎవరైతే ఈ సమస్యతో బాధ పడతారో వారిలో తొడ సమస్య కనిపించింది. కరోనా బాధితులకు స్టెరాయిడ్లు ఎక్కువగా ఇవ్వడం వల్ల ఈ సమస్య తలెత్తుతోందని తెలుస్తోంది. వైద్యులు ప్రస్తుతం ఆస్పత్రిలో చేరిన వారికి చికిత్స అందిస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో ఇతర ఆరోగ్య సమస్యలు కూడా కనిపిస్తున్నాయి.
ఉబ్బరం, వాయువు, ఆమ్లత్వం, యాసిడ్ రిఫ్లక్స్, మలబద్ధకం, ప్రకోప ప్రేగు సిండ్రోమ్ లాంటి ఇతర ఆరోగ్య సమస్యలు కరోనా నుంచి కోలుకున్న వారిలో కనిపిస్తుండటం గమనార్హం. కరోనా నుంచి కోలుకున్న వాళ్లు ఏ ఆరోగ్య సమస్య కనిపించినా వెంటనే చికిత్స తీసుకుంటే మంచిది. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది.