ప్రతిరోజూ నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?

సంస్కృతంలో “తిల” అని పిలవబడే నువ్వులు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య్గ ప్రయోజనాలు చేకూరుతాయి. రుచితో పాటు నువ్వులలో ఔషధ విలువలు కూడా పుష్కలంగా ఉంటాయి. పిల్లలు, పెద్దలకు క్యాల్షియం ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే. పాలతో పోల్చి చూస్తే 250 రెట్లు ఎక్కువ క్యాల్షియం నువ్వుల ద్వారా లభిస్తుంది. రోజూ పరగడుపున ఒక స్పూన్ నువ్వులు తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. Also Read: చక్కెర ఎక్కువగా తినే పిల్లల్లో ఆ సమస్యలు.. శాస్త్రవేత్తల […]

Written By: Navya, Updated On : February 6, 2021 5:00 pm
Follow us on

సంస్కృతంలో “తిల” అని పిలవబడే నువ్వులు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య్గ ప్రయోజనాలు చేకూరుతాయి. రుచితో పాటు నువ్వులలో ఔషధ విలువలు కూడా పుష్కలంగా ఉంటాయి. పిల్లలు, పెద్దలకు క్యాల్షియం ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే. పాలతో పోల్చి చూస్తే 250 రెట్లు ఎక్కువ క్యాల్షియం నువ్వుల ద్వారా లభిస్తుంది. రోజూ పరగడుపున ఒక స్పూన్ నువ్వులు తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.

Also Read: చక్కెర ఎక్కువగా తినే పిల్లల్లో ఆ సమస్యలు.. శాస్త్రవేత్తల వెల్లడి..?

నువ్వుల ద్వారా కాల్షియంతో పాటు జింక్ కూడా లభిస్తుంది. ఎముకలను దృఢంగా ఉంచడంలో నువ్వులు సహాయపడతాయి. నువ్వుల నూనెను వంటకాల్లో వాడితే గుండెపోటు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. నువ్వులు హృదయ నాళాలను చురుకుగా పని చేసేలా చేయడంతో పాటు త్వరగా గాయాలు మానేలా చేయడంలో సహాయపడతాయి. నువ్వులలో ఉండే లిగ్నిన్స్ చెడు కొవ్వును తొలగించడంలో సహాయపడతాయి.

Also Read: నీళ్లు తక్కువగా తాగుతున్నారా.. శరీరానికి కలిగే నష్టాలివే..?

రోజూ నల్ల నువ్వులు తింటే శరీరంలోని చెడు పదార్థాలు తొలగిపోతాయి. నువ్వుల్లో ఉండే పోషకాలు వయస్సు పెరిగినా అందంగా ఉండేలా చేస్తాయి. చర్మ సంబంధిత క్యాన్సర్ల బారిన పడకుండా చేయడంలో నువ్వులు సహాయపడతాయి. నువ్వులు రుచిగా ఉండటంతో పాటు ఔషధ విలువలను కలిగి ఉంటాయి. రక్తంలో యాంటీ ఆక్సిడెంట్ స్థాయిలను తగ్గించడంలో నువ్వులు సహాయపడతాయి.

మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

నువ్వులలో ఉండే పీచు పదార్థాలు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం సమస్యల బారిన పడకుండా రక్షిస్తాయి. నువ్వులను పొడి చేసి కూరల్లో చల్లుకున్నా, బెల్లంతో కలిపి లడ్డూలా తీసుకున్నా, తాలింపులో, రోటి పచ్చళ్లలో వాడుకున్నా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.