దేశంలో చక్కెర, బెల్లంలకు ప్రత్యామ్నాయంగా ఎక్కువ మంది తేనెను వినియోగిస్తూ ఉంటారు. రోజూ తేనె తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. కంటిచూపును మెరుగుపరచడంలో తేనె ఎంతగానో సహాయపడుతుంది. ప్రకృతి ప్రసాదించిన తేనెను ఔషధాల తయారీలో సైతం వినియోగిస్తారు. చక్కెరతో పోల్చి చూస్తే తేనెలో కేలరీలు తక్కువగా ఉంటాయి. షుగర్ తో బాధ పడేవాళ్లు తేనెను చక్కెరకు ప్రత్యామ్నాయంగా వినియోగించవచ్చు.
Also Read: తమలపాకు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..?
సాధారణ వ్యక్తులతో పోల్చి చూస్తే గర్భిణులు తేనెను తీసుకుంటే మరీ మంచిది. అన్ని వయస్సుల వారు ఎంతో ఇష్టంగా తినే తేనె మానవాళికి దివ్యౌషధం అని చెప్పవచ్చు. తేనె ద్వారా బి, సి, కె విటమిన్లతో పాటు ప్రత్యేక పోషకాలు లభిస్తాయి. గర్భిణులు తేనెను తీసుకుంటే కడుపులోని శిశువుకు ఎలాంటి హాని జరగకుండా రక్షించడంలో సహాయపడుతుంది. అయితే వైద్యుల సూచనల ప్రకారమే తేనెను తీసుకోవాలి.
Also Read: చక్కెరను ఎక్కువగా వాడేవారికి షాకింగ్ న్యూస్.. ఆ వ్యాధి వచ్చే ఛాన్స్..?
గాయాలైన చోట తేనెను రాస్తే ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉండదు. రోజూ నీళ్లలో తేనెను కలుపుకుని తాగితే సులభంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. వేడి నీటిలో పసుపు, తేనె, మిరియాల పొడి కలుపుకుని తాగితే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దగ్గు, ఇతర గొంతు సమస్యలతో బాధ పడే వాళ్లు తేనెను తీసుకుంటే ఆ సమస్యలు తగ్గుతాయి. చర్మ సంరక్షణకు కూడా తేనె తోడ్పడుతుంది.
మరిన్ని వార్తల కోసం: ఆరోగ్యం/జీవనం
జీర్ణ సంబంధిత సమస్యలతో బాధ పడే వాళ్లు రోజూ తేనెను తీసుకుంటే మంచిది. తేనెను రోజూ తీసుకుంటే కంటికి సంబంధించిన అన్ని సమస్యలను దూరం చేస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు తేనెను తీసుకుంటే మంచిది.