తెలంగాణలో టీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు.. బీజేపీ అనుకూల పవనాలు వీస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక.. గ్రేటర్ ఫలితాలే వీటిని స్పష్టం చేస్తున్నారు. దీంతో బీజేపీ శ్రేణుల్లో జోష్ నెలకొనగా.. అధికార పార్టీ మాత్రం మల్లగుల్లాలు పడుతోంది.
Also Read: నోటిఫికేషన్లు వచ్చేదాకా.. కేసీఆర్ ను నమ్మే పరిస్థితి లేదా?
దుబ్బాక.. గ్రేటర్ ఫలితాలను పరిశీలిస్తే ఉద్యోగులు.. నిరుద్యోగులు టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఉన్నట్లు స్పష్టమైంది. ఈక్రమంలోనే సీఎం కేసీఆర్ నిరుద్యోగులను.. ఉద్యోగులను తనవైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నారు.
దీనిలో భాగంగానే సీఎం కేసీఆర్ త్వరలోనే 50వేల ఉద్యోగుల భర్తీ చేస్తామని చెబుతున్నారు. అంతేకాకుండా ఉద్యోగులు ఎన్నోరోజులుగా కోరుకుతున్న పీఆర్సీపై చర్చించించేందుకు ఉద్యోగాలతో సంఘాల మాట్లాడేందుకు సిద్ధమవుతున్నారు.
కేసీఆర్ 50వేల ఉద్యోగాల ప్రకటనపై బీజేపీ ఫైర్ బ్రాండ్ విజయశాంతి తాజాగా స్పందించారు. దుబ్బాక.. జీహెచ్ఎంసీలో బీజేపీ దూకుడు చూసి కేసీఆర్ దొరగారికి ఉన్నట్టుండి నిరుద్యోగులు గుర్తొచ్చారంటూ ఎద్దేవా చేశారు.
Also Read: జగన్, కేసీఆర్ దెబ్బ: హైకోర్టు సీజేలే మారిపోయారే? ఏంటి కథ?
గడిచిన ఆరేళ్లలో నిరుద్యోగులను పూచికపుల్లలా తీసిపడేసిన కేసీఆర్ హడావుడగా 50వేల ఉద్యోగాలంటూ పొలికేక పెడుతున్నారని రాములమ్మ విమర్శించారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన జోనల్ సిస్టమ్ ను రెండేళ్లుగా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు.
సవరించిన జోన్లకు రాష్ట్రపతి ఆమోదం అవసరమని.. ఇవిగాక మరెన్నో చిక్కులు ఇందులో ముడిపడి ఉన్నాయని తెలిపారు. ఇవేమీ తేలకుండా కొత్త పోస్టుల భర్తీ చేస్తామని చెబుతూ నిరుద్యోగులను మరోసారి మోసం చేసేందుకు సిద్ధమవుతున్నారని మండిపడ్డారు.
మన ఉద్యోగాలు మనకు.. మన నీళ్ళు మనకు అని ఉద్యమకాలంలో నినదించిన కేసీఆర్ అధికారంలోకి రాగానే మర్చిపోయారన్నారు. తెలంగాణలో బీజేపీ దూకుడు చూసి కేసీఆర్ దడపుట్టిందని.. దీంతో ఇన్నాళ్లకు కేసీఆర్ కు నిరుద్యోగులు గుర్తొచ్చారని విజయశాంతి విమర్శించారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్