క్యారెట్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?

సీజన్లతో సంబంధం లేకుండా అన్ని సీజన్లలో లభించే కూరగాయలలో క్యారెట్ కూడా ఒకటి. కొందరు క్యారెట్ ను పచ్చిగా తింటే మరి కొందరు జ్యూస్ చేసుకుని తాగుతూ ఉంటారు. క్యారెట్ ద్వారా శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ అందుతాయి. క్యారెట్ కంటికి ఎంతో మేలు చేస్తుందనే సంగతి తెలిసిందే. క్యారెట్ లో విటమిన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. క్యారెట్ లో ఉండే ఫ్లావనాయిడ్‌ కాంపౌండ్స్ ఊపిరితిత్తులకు, చర్మానికి రక్షణ కల్పిస్తాయి. రోజూ క్యారెట్ ను తీసుకోవడం […]

Written By: Kusuma Aggunna, Updated On : January 17, 2021 1:26 pm
Follow us on

సీజన్లతో సంబంధం లేకుండా అన్ని సీజన్లలో లభించే కూరగాయలలో క్యారెట్ కూడా ఒకటి. కొందరు క్యారెట్ ను పచ్చిగా తింటే మరి కొందరు జ్యూస్ చేసుకుని తాగుతూ ఉంటారు. క్యారెట్ ద్వారా శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ అందుతాయి. క్యారెట్ కంటికి ఎంతో మేలు చేస్తుందనే సంగతి తెలిసిందే. క్యారెట్ లో విటమిన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. క్యారెట్ లో ఉండే ఫ్లావనాయిడ్‌ కాంపౌండ్స్ ఊపిరితిత్తులకు, చర్మానికి రక్షణ కల్పిస్తాయి.

రోజూ క్యారెట్ ను తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. క్యారెట్ రోజూ తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. రక్తపోటును నియంత్రించడంలో క్యారెట్ సహాయపడుతుంది. క్యారెట్ లో ఉండే ఫాల్కరినల్ క్యాన్సర్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది. కాలేయంలో కొవ్వులు పేరుకుపోకుండా రక్షించడంలో క్యారెట్ తోడ్పడుతుంది. క్యారెట్ తీసుకోవడం వల్ల దంతాలు, చిగుళ్ల సమస్యలకు సులభంగా చెక్ పెట్టవచ్చు.

చర్మం ప్రకాశవంతంగా మెరిసేలా చేయడంలో క్యారెట్ సహాయపడుతుంది. క్యారెట్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని విషతుల్యాలను తొలగించడంలో సహాయపడుతుంది. క్యారెట్ లో ఉండే లూటిన్ లు గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. క్యారెట్ లో ఉండే సోడియం రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. శరీరంలోని కొలెస్ట్రాల్ ను కరిగించడంలో క్యారెట్ సహాయపడుతుంది.

దంతక్షయాన్ని నిరోధించడంలో, నోటిలో హానికరమైన క్రిములను చంపడంలో సహాయపడుతుంది. క్యారెట్ కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. క్యారెట్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.