https://oktelugu.com/

నిరుద్యోగులకు శుభవార్త.. హెచ్ఐఎల్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..!

హిందుస్తాన్ ఇన్సెక్టిసైడ్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 10 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. హిందుస్తాన్ ఇన్సెక్టిసైడ్స్ లిమిటెడ్ విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా వేర్వేరు ఉద్యోగాల భర్తీ జరగనుంది. ఫైనాన్స్ మేనేజ‌ర్‌, ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజ‌ర్‌, అసిస్టెంట్ మార్కెంటింగ్ మేనేజ‌ర్‌, కంపెనీ సెక్ర‌ట‌రీ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వేర్వేరు ఉద్యోగాలకు వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి. ఒక్కో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 17, 2021 1:35 pm
    Follow us on

    హిందుస్తాన్ ఇన్సెక్టిసైడ్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 10 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. హిందుస్తాన్ ఇన్సెక్టిసైడ్స్ లిమిటెడ్ విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా వేర్వేరు ఉద్యోగాల భర్తీ జరగనుంది. ఫైనాన్స్ మేనేజ‌ర్‌, ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజ‌ర్‌, అసిస్టెంట్ మార్కెంటింగ్ మేనేజ‌ర్‌, కంపెనీ సెక్ర‌ట‌రీ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది.

    ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వేర్వేరు ఉద్యోగాలకు వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి. ఒక్కో ఉద్యోగానికి ఒక్కో ఉద్యోగ ప్రకటన వెలువడనుండగా ఉద్యోగ ప్రకటన వెలువడిన మూడు వారాల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు కేవలం ఆఫ్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

    ఫైనాన్స్ మేనేజ‌ర్‌ ఉద్యోగాలకు సీఏ పాస్ కావడంతో పాటు 12 సంవత్సరాల అనుభవం ఉండాలి. 45 సంవత్సరాల వయస్సులోపు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి 54,500 రూపాయల వరకు వేతనంగా లభిస్తుంది. అసిస్టెంట్ మార్కెంటింగ్ మేనేజ‌ర్‌ ఉద్యోగాలకు కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. బీఎస్సీ(అగ్రిక‌ల్చ‌ర్‌) లేదా సైన్స్‌లో గ్రాడ్యుయేష‌న్ చేసిన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

    40 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేయవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 46500 వ‌ర‌కు వేతనం లభిస్తుంది. అసిస్టెంట్ మార్కెటింగ్ మేనేజ‌ర్‌, కంపెనీ సెక్ర‌ట‌రీ ఉద్యోగాలకు నియమ నిబంధనలు ఒకే విధంగా ఉండగా మాస్ట‌ర్స్ డిగ్రీ పాసైన వాళ్లు కంపెనీ సెక్రటరీ ఉద్యోగానికి అర్హులు. ఆఫీసర్ ఉద్యోగాలకు మాస్టర్స్ డిగ్రీతో పాటు నాలుగు సంవత్సరాల అనుభవం ఉండాలి. అసిస్టెంట్ మేనేజ‌ర్‌ ఉద్యోగాలకు సీఏ ఉత్తీర్ణులై 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.