గత 20 సంవత్సరాల నుంచి యుగాంతం రాబోతుందంటూ ఎన్నో వార్తలు వినిపించాయి. 2012 సంవత్సరానికి కొన్ని నెలల ముందు 2012 డిసెంబర్ లో యుగాంతం జరగబోతున్నట్టు జోరుగా ప్రచారం జరిగింది. అయితే గత కొన్ని నెలలుగా యుగాంతం గురించి వార్తలు ఆగిపోగా మళ్లీ ఆ వార్తలు వినిపిస్తున్నాయి. చాలామంది వేరువేరు సిద్ధాంతాల ఆధారంగా యుగాంతం జరగబోతుందంటూ జోరుగా ప్రచారం చేస్తున్నారు.
Also Read: రేపే సూర్యగ్రహణం.. భారతదేశ ప్రజలు చూడలేరా..?
కరోనా మహమ్మారి విజృంభణ తరువాత యుగాంతం గురించి వినిపిస్తున్న వార్తలు ప్రజలను మరింత టెన్షన్ పెడుతున్నాయి. నిజంగానే యుగాంతం సంభవించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు యుగాంతం గురించి వినిపించిన వార్తల్లో నిజం లేకపోయినా కొత్తగా వినిపిస్తున్న వార్తలు తమలో భయాందోళనను రేకెత్తిస్తున్నాయని ప్రజలు చెబుతున్నారు.
Also Read: జ్వరం వస్తే తినకూడని ఆహార పదార్థాలేంటో తెలుసా..?
2003, 2012, 2020లలో యుగాంతం సంభవించబోతుందంటూ గతంలో పలువురు జ్యోతిష్యులు చెప్పిన మాటలన్నీ అబద్ధమే అని తేలింది. ప్రస్తుతం కొందరు జ్యోతీష్యులు మరి కొన్నేళ్ల పాటు యుగాంతం గురించి భయపడాల్సిన అవసరం లేదని కానీ 2050లో మాత్రం కచ్చితంగా యుగాంతం సంభవిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భూమిపై మహాప్రళయం సంభవించి యుగాంతం జరుగుతుందని జ్యోతిష్యులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
ఖగోళ శాస్త్రవేత్తలు జ్యోతిష్యుల వాదనలో నిజం లేదని చెబుతున్నా ప్రజల్లో కొందరు యుగాంతం నిజమే కావచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచం అంతం కాబోతుందంటూ వైరల్ అవుతున్న కొత్త లెక్కల వల్ల ప్రజలు పడుతున్న టెన్షన్ అంతాఇంతా కాదు.