Almond Benefits: ప్రతిరోజూ మూడు బాదం పప్పులను తీసుకుంటే చాలు.. ఈ 5 ప్రయోజనాలు పొందుతారు..

Almond Benefits:నేటి కాలంలో ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా కేర్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాతావరణంలో ఏన్నో మార్పులు రావడంతో అనేక కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. ఈ సమయంలో ఆరోగ్యంగా ఉండడానికి పౌష్టికాహరం తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Written By: Chai Muchhata, Updated On : June 9, 2024 10:51 am

Early Morning Food

Follow us on

Almond Benefits:నేటి కాలంలో ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా కేర్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాతావరణంలో ఏన్నో మార్పులు రావడంతో అనేక కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. ఈ సమయంలో ఆరోగ్యంగా ఉండడానికి పౌష్టికాహరం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణ ఆహారం కంటే డ్రై ప్రూట్స్ లో ఎక్కువ విటమిన్స్ ఉంటాయి. వీటిని తక్కువ మొత్తంలో తీసుకున్నా.. ఎక్కువగా ఎనర్జీని పొందుతారు. వీటిలో బాదం ప్రధానమైనవి. ప్రతీరోజూ మూడంటే మూడే బాదం పప్పులు తీసుకోవడం వల్ల శరీరంలో అనేక మార్పులు వస్తాయి. అవేంటంటే?

గుండెకు ఆరోగ్యం..
బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ అధ్యయనం ప్రకారం.. ప్రతిరోజూ 3 బాదం పప్పులు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ లు తగ్గించడానికి ఉపయోగపడుతాయి. ఇదే సమయంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి.

చక్కెరస్థాయిలను నియంత్రిస్తుంది..
ప్రస్తుత కాలంలో చాలా మంది డయాబెటీస్ తో బాధపడుతున్నారు. దీంతో బరువు అధికంగా పెరుగుతారు. అయితే రక్తంలో చక్కెరస్థాయిలను సమతుల్యంగా ఉంచడానికి బాదంపప్పులు సహకరిస్తాయి. బాదం పప్పులు గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. ఇవి రక్తంలోని చక్కెర పెరుగుదలను అడ్డుకుంటాయి. మెటబాలిజం జర్నల్ లో ఈ విషయంపై అధ్యయనం చేశారు.

చర్మం ఆరోగ్యం…
ప్రతిరోజూ 3 బాదం పప్పులు తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా ఉంటుంది. జర్నల్ ఆఫ్ కాస్మెటిక్ డెర్మటాలజీలో జరిపిన అధ్యయనంలో బాదంపప్పులు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మంలోని తేమ ఉండేలా సహాయపడుతుంది. అలాగే ఇవి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉండడం వల్ల చర్మకణాలు దెబ్బతినకుండా ఉంటాయి.

ఎముకలను బలపరుస్తుంది..
ఎముకలు గట్టితనానికి బాదం పప్పులు సహకరిస్తాయి. బాదం పప్పుల్లో పాస్పరస్, కాల్షియం అధికంగా ఉంటుంది. జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం నివేదికల ప్రకారం బాదంపప్పులోని ఈ ఖనిజాలు ఎముకల గట్టిదనానికి ఎంతో సహకరిస్తాయి. అలాగే ఎముకల పగుళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది..
బాదం పప్పు వల్ల జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. బాదంపప్పులో బయోటిన్, విటమిన్ బి ఉంటాయి. జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ చేసిన పరిశోధనల్లో బయోటిన్ లోపంతో జుట్టు పలచగా మారుతుంది. అయితే బాదం పప్పు తినడం వల్ల ఈ సమస్యకు పరిష్కారం ఉంటుంది.