Drinking Alcohol : నేటి కాలంలో విద్యార్థుల నుంచి ఉద్యోగులు, వ్యాపారుల వరకు తమ పనులతో ఏదో ఒక రకంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఉద్యోగాలు చేసేవారు పొద్దంతా కష్టపడితే ఆ బాధను మరిచిపోవడానికి సాయంత్రం రిలాక్స్ అవుదామని అనుకుంటారు. ఈ క్రమంలో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే ఎక్కువ శాతం మంది శారీరకంగా, మానసికంగా ఉన్న బాధలను తొలగించుకునేందుకు మద్యం తీసుకుంటూ ఉంటారు. మద్యం తాగడం వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉండొచ్చని భావిస్తారు. అంతేకాకుండా మద్యంతో గుండెకు మేలు అవుతుందని కొందరు చెబుతున్నారు. దీంతో అతిగా కాకుండా స్థిమితంగా మద్యం తీసుకోవచ్చని అంటున్నారు. కానీ ఏమాత్రం తక్కువ తీసుకున్నా.. ఆరోగ్యానికి ముప్పే అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తాజాగా నివేదిక ప్రకారం వైద్యులు ఏం చెప్పారంటే?
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)తాజాగా మద్యం తీసుకున్న వారికి జరిగిన అనారోగ్యంపై నివేదికలను వెల్లడిస్తూ కొన్ని సూచనలు చేసింది. మద్యం తాగడం వల్ల ఏమాత్రం ఆరోగ్యకరం కాదని తెలిపింది. కొంత మంది తక్కవ మొత్తంలో మద్యం తీసుకుంటే ఎలాంటి హాని కాదని అనలేమని, 20 శాతం మద్యం తీసుకున్నా క్యాన్సర్ ముప్పు కచ్చితంగా ఉందని తెలిపింది. WHOకు అనుబంధంగా ఉన్న అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధనా సంస్థ (IARC)తెలిపిన వివరాల ప్రకారం మద్యం తీసుకున్న వారిలో పేగు క్యాన్సర్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. మహిళల్లో అయితే రొమ్ము క్యాన్సర్ బాధితులు పెరిగినట్లు తెలిపారు.
యూరప్ లో స్వల్ప మద్యం తీసుకున్న వారిపై పరిశోధనలు చేయగా.. వీరిలో అత్యధిక క్యాన్సర్ కేసులు నమోదయ్యాయని WHO వెల్లడించింది. 2017లో ఇక్కడ 23 వేల క్యాన్సర్ కేసులు మద్యం సేవించేవారికి సంబంధించినవే ఉన్నాయని తెలిపారు. ఇదే నివేదికలో 50 శాతం మహిళలు రొమ్ము క్యాన్సర్ ను గుర్తించినట్లు పేర్కొన్నారు. యూరప్ ప్రాంతంలో మగవారితో పాటు ఆడవారు మద్యం సేవించే వారు ఎక్కువగా ఉన్నారని, దీంతో మరింత ఆరోగ్యాన్ని కొని తెచ్చుకోవడమేనని ఈ సంస్థ తెలిపింది. పేద, మద్య తరగతి వారు ఈ బాధితుల్లో ఎక్కువగా ఉన్నట్లు WHO పేర్కొంది.
కొంత మంది వైద్యలు స్వల్ప మోతాదులో మద్యం తీసుకోవడం వల్ల ఎలాంటి హాని చేయలేదని చెప్పడాన్ని నిర్దారించలేమని WHO తెలిపింది. ఎంత మాత్రం మద్యం తీసుకున్నా.. క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంది. అయితే మద్యపానంతో క్యాన్సర్ వస్తుందన్నవిషయం చాలా మందికి తెలియదని, కానీ క్యాన్సర్ బాధితుల్లో మద్యాపానం సేవించేవారే ఎక్కువగా ఉన్నారని అంటున్నారు. మద్యం బాటిళ్లపై క్యాన్సర్ ముప్పు అన్న ప్రకటనను తెలియజేయాలన్నారు. దీంతో కొంత వరకైనా ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని పేర్కొన్నారు.
ఇప్పటికే మద్యం బాటిళ్లపై ‘మద్యాపానం హానికరం’ అనే ట్యాగ్ ఉంటుంది. అయినా చాలా మంది దీనిని పట్టించుకోవడం లేదు. కానీ క్యాన్సర్ కారకం తెలియజేసేలా ప్రకటనను చేర్చడం ద్వారా క్యాన్సర్ ముప్పును తగ్గించవచ్చని అంటున్నారు. ఇందుకోసం ఆయా ప్రదేశాల్లో చర్యలు తీసుకోవాలని అంటున్నారు. అయితే దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.