https://oktelugu.com/

Fever: జ్వరం వచ్చినప్పుడు నాన్ వెజ్ తినవచ్చా? తింటే ఏమవుతుంది?

సాధారణంగా జ్వరం వచ్చినప్పుడు అసలు ఏ ఫుడ్ కూడా తినాలనిపించదు. పూర్తిగా జ్వరం తగ్గిన తర్వాతే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. అయితే కొందరు జ్వరం వచ్చినప్పుడు నాన్‌వెజ్ తింటుంటారు. జ్వరం వచ్చినప్పుడు నాన్ వెజ్ తినకూడదని మన పెద్దలు కూడా చెబుతుంటారు. అసలు జ్వరం వచ్చిన సమయంలో నాన్ వెజ్ తినవచ్చా? తింటే ఏమవుతుందో ఈ స్టోరీలో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 13, 2025 / 04:38 AM IST

    Fever

    Follow us on

    Fever: సాధారణంగా అందరికీ కూడా ఏదో ఒక సమయంలో జ్వరం వస్తుంది. ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్నప్పుడు, సీజన్ మారుతున్నప్పుడు కొందరికి జ్వరం వస్తుంది. అయితే ఈ సమయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోకపోతే ఇంకా సమస్య పెరుగుతుంది. తక్కువ జ్వరం ఉన్నప్పుడే మెడిసిన్ వాడి జాగ్రత్త పడాలి. అంతే కానీ మెడిసిన్ వాడకుండా సమస్యను పెద్దది చేసుకోకూడదు. ఒకవేళ చేసుకోకపోతే.. మలేరియా, డెంగ్యూ వంటివి వస్తాయి. జ్వరం వచ్చిందంటే ముఖ్యంగా ఫుడ్ విషయంలో అయితే తప్పకుండా జాగ్రత్త వహించాలి. లేకపోతే జ్వరం తీవ్రం అవుతుంది. సాధారణంగా జ్వరం వచ్చినప్పుడు అసలు ఏ ఫుడ్ కూడా తినాలనిపించదు. పూర్తిగా జ్వరం తగ్గిన తర్వాతే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. అయితే కొందరు జ్వరం వచ్చినప్పుడు నాన్‌వెజ్ తింటుంటారు. జ్వరం వచ్చినప్పుడు నాన్ వెజ్ తినకూడదని మన పెద్దలు కూడా చెబుతుంటారు. అసలు జ్వరం వచ్చిన సమయంలో నాన్ వెజ్ తినవచ్చా? తింటే ఏమవుతుందో ఈ స్టోరీలో చూద్దాం.

    జ్వరం వచ్చే మనకి తెలియకుండానే మనం నీరసం అయిపోతుంటాం. పూర్తిగా మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. దీంతో జీర్ణ శక్తి కూడా తగ్గుతుంది. ఈ క్రమంలోనే నాన్ వెజ్ తినకూడదని నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే చికెన్, మటన్ వంటివి తినడం వల్ల తొందరగా జీర్ణం కాదు. కాబట్టి నాన్ వెజ్ తినకుండా.. తొందరగా జీర్ణం అయ్యే వాటిని తినాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే జ్వరం ఉన్న సమయంలో మాంసాహారం తీసుకోవడం వల్ల లివర్ పని తీరు బాగా తగ్గిపోతుంది. దీంతో పచ్చ కామెర్లు వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందుకే జ్వరం వచ్చిన సమయంలో మాంసం వంటివి తినకూడదని నిపుణులు చెబుతున్నారు. అయితే చికెన్‌లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి మంచిదే కదా అని అందరూ అనుకుంటారు. అయితే వీటిని ఇలా కాకుండా సూప్‌లా తయారు చేసుకుని తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. సూప్‌లో శరీరానికి కావాల్సిన పోషకాలు ఉంటాయి. అలాగే తొందరగా జీర్ణం అవుతుంది. కాబట్టి డైరెక్ట్‌గా కాకుండా ఇలా తీసుకోవడం మంచిది.

    చికెన్, మటన్ అంటే ఎక్కువగా మసాలా, ఆయిల్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కాదు. అందులోనూ జ్వరం వచ్చినప్పుడు అంటే అసలు చెప్పక్కర్లేదు. అందుకే జ్వరం వచ్చిన సమయంలో వీటిని తినకూడదు. ఇందులోని మసాలా, ఆయిల్ వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. దీనికి తోడు జ్వరం ఎక్కువ అవుతుంది. కాబట్టి జ్వరం వచ్చిన సమయంలో నాన్ వెజ్ ఎక్కువగా తినకూడదు. పూర్తిగా జ్వరం తగ్గిన తర్వాత మాత్రమే తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.