Alcohol: ఏ సమయంలో మందు ఎక్కువ తాగుతారు? పగలా? రాత్రా?

ఓ పరిశోధనలో పగటి కంటే రాత్రి ఎక్కువ మద్యం తాగుతున్నారు అని తెలిసింది. ఈ నివేదికలో ప్రజలు రోజులో తక్కువ మద్యం సేవిస్తారని చెప్పారు. ఎందుకంటే పగటిపూట ఆహారం తీసుకోవడంపై ఎక్కువ దృష్టి పెడతారు.

Written By: Swathi, Updated On : May 13, 2024 11:39 am

Alcohol

Follow us on

Alcohol: మందు మందు మందు ఈ రోజుల్లో మేజర్ కాకముందే మందు తాగుతున్నారు. రోజు రోజుకు ఈ సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగిపోతుంది. అదే రేంజ్ లో మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. కొందరికైతే మద్యం లేనిది రోజు గడవదు. అయితే కొందరు పగలు తాగితే.. రాత్రి పగలు తేడా లేకుండా తాగే వారు కూడా ఉన్నారు. కొందరు పగలు, రాత్రి తేడా లేకుండా తాగేస్తున్నారు. ఉదయం మొదలు పెడితే రాత్రి వరకు తాగుతున్నారు. అయితే పగలు మద్యం తాగేవారు, రాత్రి తాగేవారిపై పరిశోధన చేశారట. మరి పగలు ఎక్కువ తాగుతున్నారా? రాత్రా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

ఓ పరిశోధనలో పగటి కంటే రాత్రి ఎక్కువ మద్యం తాగుతున్నారు అని తెలిసింది. ఈ నివేదికలో ప్రజలు రోజులో తక్కువ మద్యం సేవిస్తారని చెప్పారు. ఎందుకంటే పగటిపూట ఆహారం తీసుకోవడంపై ఎక్కువ దృష్టి పెడతారు. దీని కారణంగా మద్యం అధికంగా తాగడానికి కడుపులో ఖాలీ ఉండదు. అదే సమయంలో ప్రజలు రాత్రిపూట తక్కువ ఆహారం తీసుకుంటారు. అందుకే రాత్రిపూట ఎక్కువ మద్యం తీసుకుంటారు.

ఆల్కహాల్ కడుపులోకి ప్రవేశించిన వెంటనే, గ్యాస్ట్రిక్ యాసిడ్ ఉత్పత్తి ప్రారంభమవుతుంది. అప్పుడు క్రమంగా మన పేగులు ఆల్కహాల్‌ను గ్రహించడం ప్రారంభిస్తాయి. కొన్ని నిమిషాల తర్వాత అది మన మెదడును ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది. మనకు మత్తుగా అనిపిస్తుంది. ఆల్కహాల్ పరిమాణం అధికంగా ఉన్నప్పుడు, అది మెదడు మధ్య భాగాన్ని ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది.

క్రమంగా వ్యక్తి తన నియంత్రణను కోల్పోతుంటాడు. ఇప్పుడు జనాలు మద్యం పగటిపూట ఎక్కువ తాగుతున్నారా? లేదా రాత్రి పూట తాగుతున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. నిజానికి పగలు, రాత్రి మత్తుతో సంబంధం లేదు. ఈ పరిశోధన వల్ల డే కంటే రాత్రి ఎక్కువ మద్యం తాగే వారి సంఖ్య పెరుగుతుంది అని.. దీని వల్ల మద్యం మత్తులో రాత్రే ఎక్కువ ఉంటున్నారు అంటున్నారు పరిశోధకులు.