https://oktelugu.com/

Nani: రష్మిక ను గన్ తో బెదిరించిన నాని.. దెబ్బకు భయం తో నిజం చెప్పేసిన రష్మిక

రీసెంట్ గా బాలీవుడ్ లో 'అనిమల్ ' సినిమాతో 900 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలో కూడా తను హీరోయిన్ గా నటించడం నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి.

Written By:
  • Gopi
  • , Updated On : May 13, 2024 / 11:48 AM IST

    Nani

    Follow us on

    Nani: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. వాళ్ళు చేసిన సినిమాలతో ప్రేక్షకుల మన్ననలు పొందడమే కాకుండా సక్సెస్ లను కూడా సాధించి ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్స్ గా కొనసాగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక ప్రస్తుతం రష్మిక మందాన కూడా వరుస సినిమాలను చేస్తూ తనకంటూ ప్రత్యేకతను అయితే ఏర్పాటు చేసుకుంటుంది. ఇక ఈమె తెలుగులో ఛలో, సరిలేరు నీకెవ్వరు, పుష్ప లాంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది.

    ఇక అలాగే రీసెంట్ గా బాలీవుడ్ లో ‘అనిమల్ ‘ సినిమాతో 900 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలో కూడా తను హీరోయిన్ గా నటించడం నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో కూడా మరోసారి తనను తాను స్టార్ హీరోయిన్ గా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక ఇదిలా ఉంటే రష్మిక కెరియర్ మొదట్లో నాని తో కలిసి ఒక సినిమా చేసింది.

    ఆ సినిమా గురించి మనలో చాలామందికి తెలియదు. ఇంతకీ అది ఏ సినిమా అంటే ‘ దేవదాస్ ‘.. ఈ సినిమాలో నాని నాగార్జున ఇద్దరూ కలిసి నటించారు. దీనికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమాలో నానికి జోడిగా రష్మిక మందాన నటించడమే కాకుండా పోలీస్ ఆఫీసర్ గా కూడా తను నటించి మెప్పించింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగార్జున, నాని, రష్మిక మందాన, ఆకాంక్ష సింగ్ నలుగురు పాల్గొన్నారు.

    ఇక దాంట్లో నాని రష్మిక తో తెలుగులో నీ ఫేవరెట్ కో స్టార్ ఎవరు అని అడగగా, నాగార్జున కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ విజయ్ దేవరకొండ, నాగశౌర్య, నాని వీళ్ళలో నీ ఫేవరెట్ హీరో ఎవరు అని అడిగాడు. దానికి రష్మిక ఆలోచిస్తూ ఉండగా నాని గన్ను తీసి చేత్తో పట్టుకున్నాడు. దాంతో ఆ గన్ చూసిన రష్మిక నా ఫేవరెట్ హీరో నాని అని చెప్పేసింది. ఇక ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ అవుతుంది…