Homeఎంటర్టైన్మెంట్Junior NTR: పబ్లిక్ ఈవెంట్ లో బూతులు తిట్టిన జూనియర్ ఎన్టీఆర్.. వైరల్ అవుతున్న వీడియో..

Junior NTR: పబ్లిక్ ఈవెంట్ లో బూతులు తిట్టిన జూనియర్ ఎన్టీఆర్.. వైరల్ అవుతున్న వీడియో..

Junior NTR: గత కొద్దిరోజుల నుండి సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా లో ఎక్కడ చూసినా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం పైనే చర్చ. అసలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ఎన్టీఆర్ ఒక్క మాట కూడా చెప్పలేదు , అయినప్పటికీ ఈ రేంజ్ లో ప్రచారం జరగడానికి ముఖ్య కారణం , ఆయన అభిమాన సంఘాలు నిర్వహిస్తున్న ‘ఊరువాడా’ కార్యక్రమమే. సుమారుగా 100 కోట్ల రూపాయిల విలువ గల సేవా కార్యక్రమాలను ఈ కార్యక్రమం ద్వారా నిర్వహించనున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. అయితే ఇందులో ఎన్టీఆర్ ప్రమేయం ఉందా , లేదా అనే అంశం పై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ నెల 18 న జూనియర్ ఎన్టీఆర్ ప్రెస్ మీట్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపైన కూడా అధికారకంగా ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఈ రూమర్స్ ని మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

ఎందుకంటే వాళ్లకు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకంటే ఎక్కువగా రాజకీయంగా కనెక్ట్ అయ్యారు. 2009 లో టీడీపీ పార్టీ తరుపున ఎన్టీఆర్ చేసిన ఎన్నికల ప్రచారం అలాంటిది మరీ. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి , చిరంజీవి సునామీ లను తట్టుకొని కూడా టీడీపీ ఆ ఎన్నికల్లో బలంగా నిలబడిందంటే , అందుకు ముఖ్య కారణం జూనియర్ ఎన్టీఆర్ ప్రసంగాలే . వాటిని చూస్తే తెలుగు దేశం పార్టీ అభిమానులు, నందమూరి అభిమానులకు సీనియర్ ఎన్టీఆర్ ప్రసంగాలు గుర్తొచ్చేవి. ఆరోజుల్లో ఎన్టీఆర్ సభలకు జనాలు తండోపతండాలుగా వచ్చేవారు. పట్టుమని పాతికేళ్ళు కూడా లేని కుర్రాడు , ఇంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు, రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఇతనిలో ఉన్నాయి, భవిష్యత్తులో సీఎం అయ్యే సత్తా కూడా ఇతనికి ఉంటుందని అప్పట్లో రాజకీయ విశ్లేషకులు అనేవారు. అయితే 2009 తర్వాత ఎన్టీఆర్ రాజకీయాలకు దూరమై , కేవలం సినిమాల మీద మాత్రమే ఫోకస్ పెట్టారు.

గడిచిన మూడు ఎన్నికల్లో ఆయన టీడీపీ పార్టీ కి దూరంగానే ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఒక్కసారిగా మరోసారి ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ రూమర్స్ వైరల్ అవ్వడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. కేవలం రూమర్స్ కే అభిమానులు ఇంత సంతోషిస్తున్నారంటే , ఇక నిజంగా రాజకీయ అరంగేట్రం చేస్తే ఎలా ఉంటుందో అని ఇప్పటి నుండే లెక్కలు వేసుకుంటున్నారు అభిమానులు. ఇదంతా పక్కన పెడితే ఎన్టీఆర్ ఒకప్పుడు తన ప్రసంగం లో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులపై బూతులతో నోరు జారిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version