sneeze : ఉదయం లేవగానే ఫుల్ తుమ్ములా? అయితే ఈ సమస్యతో బాధ పడుతున్నారు

పెరుగుతున్న కాలుష్యం, మారుతున్న వాతావరణం కారణంగా జీవనశైలి సమస్యలు పెరుగుతున్నాయి. ఫుడ్ విషయంలో చాలా మంది జాగ్రత్తలు తీసుకోవడం లేదు. తీసుకున్న సరే చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఎన్నో వ్యాధుల బారిన పడుతున్న చాలా మందిని చూస్తూనే ఉన్నాం. అయితే చాలా మందికి ఉదయం నిద్రలేచిన వెంటనే శ్వాస సంబంధిత సమస్యలు వస్తున్న సంగతి తెలిసిందే. కొందరికి నిద్రలేవగానే తుమ్ములు కంటిన్యూగా వస్తుంటాయి. దీనిని అలర్జిక్ రినిటిస్ అని పిలుస్తారు.

Written By: Swathi Chilukuri, Updated On : October 25, 2024 8:25 am

A full sneeze when you wake up in the morning? But suffering from this problem

Follow us on

sneeze :ఇలా జరగడాన్ని గవత జ్వరం అని కూడా అంటారు. ఇది ఒక అలెర్జీ పరిస్థితి. ముక్కు దిబ్బడ, ముక్కులో దురద, తుమ్ములు,  కళ్లలో నీరు కారడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ అలెర్జీ రినిటిస్ ఎవరికైనా రావచ్చు. దీనికి అనేక కారణాలు కూడా ఉన్నాయి అంటున్నారు నిపుణులు.  లక్షణాలు పెరిగితే, రోగి చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలర్జిక్ రైనైటిస్ సమస్య ముఖ్యంగా ఉదయం నిద్రలేచిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటిగా తుమ్ములు వస్తుంటాయి. ధూళి కణాలు శ్వీసనాళంలోకి వెళ్తాయి. దీంతో కూడా ఇది సంభవిస్తుంది. ఈ సమస్య ఉన్నవారిలో గాలిలో ఉండే అతి చిన్న రేణువులు కూడా అలర్జీని కలిగిస్తాయి అంటున్నారు నిపుణులు. ఈ చిన్న కణాలు ముక్కు, నోటి ద్వారా ప్రవేశించినప్పుడు తుమ్ములు కంటిన్యూగా వస్తుంటాయి.

అలెర్జీ రినిటిస్ లక్షణాలు ఏంటో కూడా చూసేద్దాం..
తుమ్ములు, నాసికా రద్దీ, ముక్కు, గొంతు, నోరు మరియు కళ్లలో మంట వస్తుంది. ముక్కు కారటం, ముక్కు, గొంతు, కళ్లలో నీరు కారడం సంభవిస్తుంది. కళ్ళు ఎర్రగా మారడం. తలనొప్పి, సైనస్, కళ్ల కింద నల్లటి వలయాలు రావడం, ముక్కు, గొంతులో శ్లేష్మం ఏర్పడటం, విపరీతమైన అలసట, గొంతు నొప్పి, శ్వాసలో దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఉంటాయి.

అలెర్జీ రినిటిస్ కారణాలు
లేడీ హార్డింజ్ హాస్పిటల్‌లోని మెడిసిన్ విభాగంలో ప్రొఫెసర్ డాక్టర్ సుభాష్ గిరి ఈ విషయం గురించి కొన్ని విషయాలు తెలిపారు. ఇండోర్, అవుట్‌డోర్ అలెర్జీల వల్ల అలర్జీ రినైటిస్ వస్తుందని.. ట్రిగ్గర్‌లలో చెట్లు, మొక్కలు, కలుపు మొక్కలు, పెంపుడు జంతువుల శరీరం నుంచి వెలువడే చుండ్రు, చిన్న దుమ్ము రేణువుల వంటి పుప్పొడి వల్ల ఇది సంభవిస్తుందని పేర్కొన్నారు. ఇది కాకుండా ఇతర కారకాలు కూడా రోగులను ప్రేరేపిస్తాయి అన్నారు. పెరుగుతున్న కాలుష్యం, వసంత ఋతువు, వాతావరణం మారుతున్నప్పుడు,  శరదృతువు ప్రారంభంలో అలెర్జీ రినిటిస్ చాలా సాధారణంగా కనిపిస్తాయట. ఎందుకంటే ఈ సమయంలో గాలిలో ధూళి కణాలు పెరుగుతాయని పేర్కొన్నారు. కొన్నిసార్లు ఇది పెంపుడు జంతువుల జుట్టు, చుండ్రు వల్ల కూడా వస్తుందని వాటి నుంచి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.