Ind W Vs Nz W Odi: మూడు వన్డేల సిరీస్ లో న్యూజిలాండ్ జట్టు భారత్ లో పర్యటిస్తోంది. వచ్చే ఏ డాది వన్డే వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ఈ టోర్నీని భారత జట్టు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పైగా టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కు ఈ సిరీస్ అత్యంత ముఖ్యం కావడంతో.. టీమిండియా మేనేజ్మెంట్ పకడ్బందీగా వ్యవహరించింది. జట్టు కూర్పును కూడా సమర్థవంతంగా రూపొందించింది. కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చినప్పటికీ… యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించింది. దీంతో పాత కొత్త కలయికతో టీమిండియా అరారింది. టీమిండియా ప్లేయర్లు కసి కొద్ది ఆడటంతో టి20 వరల్డ్ కప్ సాధించిన న్యూజిలాండ్ జట్టు ఒక్కసారిగా తలవంచింది.. అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ ఏకంగా 59 రన్ తేడాతో విజయం సాధించింది. దీప్తి శర్మ 41 రన్స్, 1/35 ఆల్ రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. భారత జట్టు సాధించిన గెలుపులో ముఖ్యపాత్ర పోషించింది.. కెప్టెన్ హర్మన్ ఫిట్ నెస్ సరిగా లేకపోవడంతో ఈ మ్యాచ్ కు దూరమైంది. దీంతో బైస్ కెప్టెన్ స్మృతి మందాన జట్టుకు నాయకత్వం వహించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు 44.3 ఓవర్లలో టు 27 రన్స్ చేసింది.. హస బీన్స్ 42, దీప్తి శర్మ 41, జెమిమా 35, యాస్తిక భాటియా 37, షఫాలి వర్మ 33 పరుగులు చేసి టాప్ స్కోరర్లుగా గెలిచారు. స్మృతి మందాన ఐదు పరుగులకే వెనుదిరగడం టీమిండియా అభిమానులను నిర్వేదంలో ముంచింది. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో అమేలీయ నాలుగు వికెట్లను పడగొట్టింది. జెస్ కేర్ మూడు వికెట్లను సొంతం చేసుకుంది. కార్సన్ రెండు వికెట్లను పడగొట్టింది.
భారత బౌలర్ల ధాటికి..
టి20 వరల్డ్ కప్ లో ఓడించిందనే కసితో టీమ్ ఇండియా బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్ చేశారు. ఫలితంగా న్యూజిలాండ్ బ్యాటర్లు వణికి పోయారు. 40.4 ఓవర్లలో 168 పరుగులకే చాప చుట్టేశారు. బ్రూక్ 39, గ్రీన్ 31 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. రాధా యాదవ్ 3 వికెట్లు సొంతం చేసుకుంది. సజ్మా రెండు వికెట్లు దక్కించుకుంది. దీప్తి, అరుంధతి చెరో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ లో దీప్తి శర్మ అద్భుతమైన ప్రతిభ చూపించింది. ముఖ్యంగా న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డివైన్ (2) బద్ధకంతో రనౌట్ అయింది.. టి20 వరల్డ్ కప్ సాధించామని గర్వమో లేక రనౌట్ చేయలేరనే అతి విశ్వాసము తెలియదు గాని.. చిత్రమైన తీరుగా ఆమె అవుట్ అయింది. దీప్తి శర్మ అత్యంత చాకచక్యంగా సోఫీ డివైన్ ను పెవిలియన్ పంపించింది. దీప్తివేసిన 12 ఓవర్లో ఈ సంఘటన జరిగింది. దీప్తి 12వ ఓవర్ చివరి బంతిని ఆఫ్ స్టంప్ లైన్ లో వేసింది. దానిని భారీ షాట్ ఆడటానికి సోఫీ ప్రయత్నించింది. అయితే బంతి పడిన గమనాన్ని అంచనా వేసి డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించింది. బంతి ఒక్కసారిగా దీప్తి శర్మ చేతుల్లోకి వెళ్ళింది. అయితే ఆమె బంతిని చేతిలో పట్టుకొని రనౌట్ చేస్తానన్నట్టుగా బెదిరించింది. అయినప్పటికీ సోఫీ అక్కడే నిలబడి ఉంది. వెంటనే దీప్తి శర్మ బంతిని వికెట్ కీపర్ కు అందించింది. ఆమె అంతే వేగంతో వికెట్లను పడగొట్టింది. థర్డ్ ఎంపైర్ సమీక్షలో డివైన్ ఇంచు దూరం తేడాతో క్రీజ్ బయట ఉన్నట్టు కనిపించింది. వాస్తవానికి సోఫీ డివైన్ బ్యాట్ పెట్టి ఉంటే అవుట్ కాకుండా ఉండేది. కాకపోతే అతి విశ్వాసం, బద్ధకం వల్ల వికెట్ కోల్పోయింది. కాగా న్యూజిలాండ్ జట్టు గత ఆదివారం దక్షిణాఫ్రికా జట్టును ఓడించి టి20 వరల్డ్ కప్ దక్కించుకుంది. వారం కూడా కాకముందే వన్డే మ్యాచ్ లో భారత్ చేతిలో ఓడింది.