https://oktelugu.com/

Health Insurance : 70 ఏళ్ల పైబడిన వారికి కేంద్రం రూ.5 లక్షల సాయం.. ఎలాగో తెలుసుకోండి..

వయసును బట్టి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఉంటుంది. వయసు పెరిగేకొద్దీ ప్రీమియం పెరుగుతూ ఉంటుంది. అలాగే 60 ఏళ్లు నిండిన వారికి హెల్త్ ఇన్సూరెన్స్ వర్తించదు. ఎందుకంటే ఆ సమయంలో వారికి అనేక వ్యాధులు ఆటోమేటిక్ గా వస్తుంటాయి. అయితే కేంద్ర ప్రభుత్వం 70 ఏళ్ల వయసు పైబడిన వారికి ఉచితంగా రూ. 5 లక్షల ఇన్సూరెన్స్ అందిస్తుంది. ఆ స్కీం ఏంటో తెలుసుకోవాలని ఉందా?

Written By:
  • Srinivas
  • , Updated On : October 4, 2024 6:03 pm
    Ayushman Bharat Health

    Ayushman Bharat Health

    Follow us on

    Health Insurance : ప్రస్తుతం కాలంలో Health Insurance తప్పనిసరిగా మారింది. ఎందుకంటే కొన్ని వ్యాధుల నివారణకు లక్షల్లో ఖర్చు అవుతోంది. అంతేకాకుండా వయసుతో సంబంధం లేకుండా జబ్బులు రావడంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియకుండా ఉంది. దీంతో చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. అయితే వయసును బట్టి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఉంటుంది. వయసు పెరిగేకొద్దీ ప్రీమియం పెరుగుతూ ఉంటుంది. అలాగే 60 ఏళ్లు నిండిన వారికి హెల్త్ ఇన్సూరెన్స్ వర్తించదు. ఎందుకంటే ఆ సమయంలో వారికి అనేక వ్యాధులు ఆటోమేటిక్ గా వస్తుంటాయి. అయితే కేంద్ర ప్రభుత్వం 70 ఏళ్ల వయసు పైబడిన వారికి ఉచితంగా రూ. 5 లక్షల ఇన్సూరెన్స్ అందిస్తుంది. ఆ స్కీం ఏంటో తెలుసుకోవాలని ఉందా?

    కేంద్ర ప్రభుత్వం రూ. 5 లక్షల వరకు వైద్య ఖర్చులు భరిస్తూ ప్రజలకు హెల్త్ కార్డులను జారి చేస్తుంది. ఇందులో ‘ఆయుష్మాన్ భారత్’ ఒకటి. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని 2018లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీని ద్వారా 50 కోట్ల మందికి ఉచితంగా వైద్యం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని నిర్వహణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులు సమకూరుస్తాయి. దీనిని ప్రారంభించిన తరువాత 20 రాష్ట్రాల్లో అమలు చేశారు. కేరళలో 2019 నుంచి ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటోంది.

    దేశంలోని ప్రతి కుటుంబానికి ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు ద్వారా రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించింది. అయితే దీనిని ఎక్కువగా మధ్యతరగతి, పేదలకు అందించాలని నిర్ణయించారుు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు పొందాలంటే ఎస్సీ, ఎస్టీతో పాటు తక్కువ ఆదాయం కలిగి ఉండాలి. ఆన్ లైన్ లో ఆధార్ కార్డు ఆధారంగా దీని కోసం దరఖాస్తు చేసుకొని ఆయుష్మాన్ భారత్ కార్డును పొందవచ్చు.

    అయితే కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ స్కీం కింద కొత్తగా హెల్త్ ఇన్సూరెన్స్ పథకాన్ని తీసుకొచ్చింది. 2024 సెప్టెంబర్ 12న దీనిని ప్రవేశపెట్టారు. ఈ ఇన్సూరెన్స్ 70 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. దీని ప్రకారం 70 ఏళ్ల వయసు పైబడిన వారు ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రిలో చేరితే వారి వైద్య ఖర్చుల కోసం రూ. 5 లక్షల వరకు సాయం చేస్తుంది. అయితే 70 ఏళ్ల వారు ఈ సదుపాయం పొందాలంటే పేదవాళ్లు కానక్కర్లేదు. ఈ ప్రయోజనం అన్ని వర్గాల వారికి వర్తిస్తుంది. అయితే ఇందుకోసం ముందుగానే తమ పేరును నమోదు చేసుకొని ఉండాలి.

    నేటి కాలంలో వృద్ధులు ఎక్కువ శాతం ఆసుపత్రిలో చేరుతున్న విషయం తెలిసిందే. అయితే వీరికి సాధారణ ఇన్సూరెన్స్ వర్తించదు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం 70 ఏళ్ల పైబడిన వారందరికీ ఆయుష్మాన్ హెల్త్ ఇన్సూరెన్స్ వర్తించేలా చేసింది. దీంతో చాలా మంది తమకు అయ్యే వైద్య ఖర్చుల భారం నుంచి కుటుంబ సభ్యులు సేఫ్ గా ఉండగలుగుతారు. ఈ కార్డు కోసం దగ్గర్లోని మీ సేవా కార్యాలయంలో సంప్రదించి పొందాల్సి ఉంటుంది.