https://oktelugu.com/

Junior NTR-Prashanth Neil : అక్షరాలా 3000 కోట్లు..’దేవర’ తర్వాత ఎన్టీఆర్ సరికొత్త ప్రభంజనం..ఫ్యాన్స్ కి ఇక పూనకాలే!

త్వరలోనే 'దేవర 2 ' షూటింగ్ ప్రారంభం కానుంది అని ఎన్టీఆర్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. ఇదంతా పక్కన పెడితే ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో త్వరలోనే ఒక సినిమా రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టుకోబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి.

Written By:
  • Vicky
  • , Updated On : October 4, 2024 / 07:37 PM IST

    Junior NTR-Prashanth Neil Combination

    Follow us on

    Junior NTR-Prashanth Neil :  నందమూరి అభిమానులు ప్రస్తుతం ‘దేవర’ మూవీ సక్సెస్ తో ఫుల్ జోష్ మీదున్న సంగతి అందరికీ తెలిసిందే. ఒక పక్క బాలయ్య బాబు వరుస బ్లాక్ బస్టర్ హిట్లు, మరో పక్క టీడీపీ పార్టీ ప్రభుత్వం లోకి రావడం, ఇప్పుడు ‘దేవర’ మూవీ పాన్ ఇండియన్ లెవెల్ లో భారీ హిట్ కొట్టడం, త్వరలో బాలయ్య బాబు కొడుకు మోక్షజ్ఞ మొదటి సినిమా ప్రారంభం కాబోతుండడం, ఇలా వరుసగా నందమూరి అభిమానులు సంబరాలు చేసుకునే సందర్భాలు వస్తూనే ఉన్నాయి. ఇటీవలే ‘దేవర’ చిత్రానికి సంబంధించిన సక్సెస్ సెలెబ్రేషన్స్ కూడా జరిగాయి. త్వరలోనే ‘దేవర 2 ‘ షూటింగ్ ప్రారంభం కానుంది అని ఎన్టీఆర్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. ఇదంతా పక్కన పెడితే ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో త్వరలోనే ఒక సినిమా రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టుకోబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి.

    ఈ సినిమా కథ ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఎవ్వరూ చూడని విధంగా ఉంటుందట. ఇందులో తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ విలన్ గా నటించబోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. నటనలో కమల్ హాసం విశ్వరూపం ఎలాంటిదో మన అందరికీ తెలుసు, ఇక టాలీవుడ్ నేటి తరంలో మహానటుడిగా ఎన్టీఆర్ ని చూడొచ్చు. ఇలా వీళ్లిద్దరు కలిసి ఒకే సినిమాలో కనిపిస్తే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోవచ్చు. ఇద్దరి టాలెంట్ ని సంపూర్ణంగా వాడుకునే కథతోనే ప్రశాంత్ నీల్ మన ముందుకు రాబోతున్నాడట. కేవలం కమల్ హాసన్ పాత్ర మాత్రమే కాదు, ఎన్టీఆర్ పాత్ర కి కూడా చాలా నెగటివ్ షేడ్స్ ఉంటాయట. ఇంత భారీ కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోవచ్చు. ఎందుకంటే కొరటాల లాంటి మామూలు టాలీవుడ్ కమర్షియల్ డైరెక్టర్ తో సినిమా చేస్తేనే, దేశ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరు ఆ సినిమా కోసం ఎదురు చూసేలా చేసాడు ఎన్టీఆర్.

    ఇక ఓపెనింగ్ వసూళ్ల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ‘ఆచార్య’ లాంటి డిజాస్టర్ ఫ్లాప్ అందించిన డైరెక్టర్ తో సినిమా చేసి మొదటి రోజు 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టాడు. ఇప్పుడు ఈ చిత్రం ఫుల్ రన్ లో 400 కోట్ల రూపాయిల గ్రాస్ వైపు పరుగులు తీస్తుంది. ‘దేవర’ తోనే అనకాపల్లి నుండి అమెరికా వరకు రికార్డ్స్ ని ఉరికించి కొట్టిన ఎన్టీఆర్, ఇక ప్రశాంత్ నీల్ తో ఎలాంటి సెన్సేషన్ సృష్టించబోతున్నాడో ఊహించుకోవచ్చు. ఈసారి కొడితే వెయ్యి కోట్లు కాదు, ఏకంగా 3000 కోట్ల రూపాయిల క్లబ్ లోకి ఎన్టీఆర్ చేరిపోయిన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. మూవీ స్టోరీ అంత పవర్ ఫుల్ గా వచ్చిందట. 2026 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.