https://oktelugu.com/

Pawan Kalyan: ఫ్రెండ్ అయినా కూడా పవన్ ను ప్రకాష్ రాజ్ ఎందుకు వదలడం లేదు…

సినిమా ఇండస్ట్రీ లో ఉన్న హీరోలందరిలో పవన్ కళ్యాణ్ కి చాలా మంచి క్రేజ్ ఉంది. ఒక్కప్పుడు ఆయనకి దాదాపు 10 సంవత్సరాల పాటు ఒక్క హిట్ లేకపోయిన కూడా ఆయన క్రేజ్ అయితే ఏమాత్రం తగ్గలేదు. ఇక పవర్ స్టార్ ప్రస్తుతం చాలా బిజీగా కొనసాగుతూ ఉండడం విశేషం...

Written By:
  • Gopi
  • , Updated On : October 4, 2024 / 05:58 PM IST

    Pawan Kalyan(20)

    Follow us on

    Pawan Kalyan: మొదట హీరోగా తన కెరీయర్ ని మొదలుపెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం సక్సెస్ ఫుల్ పొలిటిషన్ గా ముందుకు సాగుతున్నాడు. ఇక రీసెంట్ గా ఏపీ లో జరిగిన ఎలక్షన్స్ లో జనసేన పార్టీని గెలిపించుకోవడమే కాకుండా ఎన్డీయే ఏ కూటమిని కూడా అధికారంలోకి తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర వహించాడు. ప్రస్తుతం ఆయన ఉప ముఖ్యమంత్రిగా తన పదవీ బాధ్యతలను కొనసాగిస్తూనే అవకాశం దొరికినప్పుడు సినిమాలు చేయడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక ప్రస్తుతం భవాని అమ్మవారి మాల వేసుకున్న పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి గత కొద్ది రోజులుగా మాట్లాడుతున్నాడు. ఇక దీని గురించి ప్రకాష్ రాజ్ కు అవసరం లేకపోయిన కూడా పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా కొన్ని పోస్టులైతే పెడుతున్నాడు. నిజానికి వీళ్ళ మధ్య ఇంతకు ముందు కూడా ఇలాంటి రచ్చ అయితే జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడు ప్రకాష్ రాజ్ ని పట్టించుకునే వాడు కాదు. కానీ రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఒక ప్రెస్ మీట్ లో ప్రకాష్ రాజ్ ను ఉద్దేశించి కూడా మాట్లాడాడు. అసలు ఆయనకు సంబంధంలేని మ్యాటర్ లో ఎందుకు ఆయన ఇన్వాల్వ్ అవుతున్నాడనే అర్థం వచ్చేలా పవన్ కళ్యాణ్ చాలా ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇక దానికి కూడా ప్రకాష్ రాజ్ ఏదో కౌంటర్ అయితే ఇచ్చాడు. ఇక ప్రతి సారి పవన్ కళ్యాణ్ ను మాత్రమే టార్గెట్ చేసి మాట్లాడుతున్న ప్రకాష్ రాజ్ కు ఎందుకని ‘సనాతన ధర్మం’ అంటే ఇష్టం ఉండదు అంటే ఆయన సెక్యులర్ భావజాలం కలిగినవాడు. మరి అలాంటి వాడు సనాతన ధర్మాన్ని కూడా ఆహ్వానించాలి కదా అని సగటు జనాలు కూడా ప్రకాష్ రాజుని విమర్శిస్తున్నారు. ఇక రీసెంట్ గా పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ సందర్భంగా సనాతన ధర్మం గురించి మాట్లాడాడు… ఇక దాంతో పాటుగా తను ఒక పెద్ద సనాతన హిందువునని కూడా ప్రకటించాడు… ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ ప్రకాష్ రాజ్ ‘సనాతన ధర్మరక్షణలో మీరు ఉండండి’, సమాజ రక్షణలో మేముంటాం.. జస్ట్ ఆస్కింగ్ అంటూ ఒక పోస్ట్ అయితే చేశాడు. ఇక ఇది చూసిన పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు సైతం ప్రకాష్ రాజ్ మీద మరొకసారి విరుచుకుపడుతున్నారు.

    నిజానికి పవన్ కళ్యాణ్ ఏదైనా మాట మాట్లాడితే చాలు ప్రకాష్ రాజ్ వెంటనే ఒక ట్వీట్ పెడతాడు. అతనికి సంబంధం లేని విషయం అయినా కూడా ఏదో కలిగించుకొని మరి పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటల్లో తప్పుంది అనే రేంజ్ లో ఆయన ట్వీట్ చేస్తారు. నిజానికి వీళ్ళిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. ఆయా సినిమాల్లో వీళ్ళ కాంబినేషన్ కి మంచి గుర్తింపైతే ఉంది.

    అయినప్పటికీ ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ని విమర్శించడానికి కారణం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు. అలాగే బిజెపి పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు. కాబట్టి ప్రకాష్ రాజ్ కి అది నచ్చడం లేదు.
    మొదటి నుంచి కూడా ప్రకాష్ రాజ్ బీజేపీకి వ్యతిరేకంగా ఉంటు వచ్చాడు. కాబట్టి అవకాశం దొరికిన ప్రతిసారి బిజెపి మీద కూడా కొన్ని విమర్శలు చేస్తూ ఉండేవాడు.

    ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ పార్టీకి దగ్గర అవుతుండడం తనకు నచ్చకపోవడం వల్లే అనవసరపు ట్వీట్లు చేస్తున్నాడు అంటూ కొంతమంది సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…