https://oktelugu.com/

Corona : కరోనా మళ్లీ వస్తోంది.. వారంలో 25,900 కేసులు.. హైఅలెర్ట్‌!

ప్రస్తుతం సింగపూర్‌లో కేపీ–1, కేపీ–2 వేరియంట్‌ కేసులు నమోదవుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే వీటి తీవ్రత ఇంకా నిర్ధారణ కాలేదు.

Written By:
  • NARESH
  • , Updated On : May 19, 2024 / 04:23 PM IST

    25,900 cases of corona in Singapore again in a week.

    Follow us on

    Corona : కరోనా ప్రపంచాన్ని వదిలేలా కనిపించడం లేదు. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌పై తయారీ సంస్థలు ఒక్కొక్కటిగా ప్రకటనలు చేస్తూ ప్రచంచాన్ని షాక్‌కు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా మరోమారు చాపకింద నీరులా విస్తరించడం కలకలం రేపుతోంది. తాజాగా సింగపూర్‌లో కరోనా విజృంభిస్తోంది. మే 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆ దేశంలో 25,900 కేసులు నమోదైనట్లు ఆ దేశ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కుంగ్‌ తెలిపారు. వైరస్‌ వ్యాప్తి వేగంగా ఉన్నందున ప్రజలు నిబంధనలు పాటించాలని, మాస్కులు ధరించాలని సూచించారు.

    భయపెడుతున్న కొత్త వేరియంట్‌..
    సింగపూర్‌లో కరోనా కొత్త వేరింయట్‌ వేగంగా వ్యాప్తి చెందుతుందని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో అందరూ మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించాలని తెలిపారు. వారం వ్యయధిలోనే వేల సంఖ్యలో కేసులు నమోదు కావడం వైరస్‌ వ్యాప్తికి నిదర్శనం. ఇప్పటికే సింగపూర్‌లో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. దీంతో చికిత్సకు సదుపాయాలు సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం ఆస్పత్రులను ఆదేశించింది. పడకల సామర్థ్యం పెంచాలని సూచించింది.

    నాలుగు వారాల్లో గరిష్టస్థాయికి..
    ఇదిలా ఉంటే దేశంలో కరోనా నాలుగు వారాల్లో గరిష్టస్థాయికి చేరుతుందని అక్కడి వైద్యాధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 250 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపింది. పెరుగుతున్న కేసులకు అనుగుణంగా ఆస్పత్రులను సిద్ధం చేస్తోంది. ఏప్రిల్‌లోనే వైరస్‌ వ్యాప్తి మొదలైంది. ఏప్రిల్‌ చివరి వారంలో 13,700 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తి ఉధృతమైంది. మే నెలాఖరు నాటికి వేవ్‌ మరింత ఉధృతంగా ఉంటుందని భావిస్తోంది. ఈ క్రమంలో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షలు చేస్తోంది.

    ఇంటి వద్దే చికిత్స..
    కొత్త వేరియంట్ల ఉధృతి ఎక్కువగా ఉన్నందున ఆస్పత్రుల్లో చేరకుండానే బాధితులకు చికిత్స అందించే అంశాన్ని కూడా సింగపూర్‌ ప్రభుత్వం పరిశీలిస్తోంది. మరోవైపు వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో అందరూ మరోమారు వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచించింది. ప్రస్తుతం సింగపూర్‌లో కేపీ–1, కేపీ–2 వేరియంట్‌ కేసులు నమోదవుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే వీటి తీవ్రత ఇంకా నిర్ధారణ కాలేదు.