https://oktelugu.com/

మద్యం ప్రియులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ఎక్సైజ్ శాఖ..?

తెలంగాణ ఎక్సైజ్ శాఖ మద్యం ప్రియులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని 72 మున్సిపాలిటీలలో 159 బార్లకు ఎక్సైజ్ శాఖ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ 159 బార్లలో 104 బార్లు పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు కానుండగా 55 బార్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు కానుండటం గమనార్హం. సోమవారం 159 బార్లకు ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లా ఎక్సైజ్‌ అధికారులు ఫిబ్రవరి నెల 8వ తేదీ వరకు […]

Written By: Kusuma Aggunna, Updated On : January 26, 2021 2:06 pm
Follow us on

తెలంగాణ ఎక్సైజ్ శాఖ మద్యం ప్రియులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని 72 మున్సిపాలిటీలలో 159 బార్లకు ఎక్సైజ్ శాఖ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ 159 బార్లలో 104 బార్లు పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు కానుండగా 55 బార్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు కానుండటం గమనార్హం. సోమవారం 159 బార్లకు ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.

జిల్లా ఎక్సైజ్‌ అధికారులు ఫిబ్రవరి నెల 8వ తేదీ వరకు కొత్త బార్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. వచ్చే నెల 10వ తేదీన 104 బార్లకు ఆయా జిల్లాల కలెక్టర్లు బార్లను లాటరీ పద్ధతిలో కేటాయిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషన్ పరిధిలో మాత్రం ఫిబ్రవరి నెల 11వ తేదిన డ్రా తీసి బార్లను కేటాయిస్తారు. లాటరీ వచ్చిన వారికి 17వ తేదీన అధికారులు బార్లను కేటాయిస్తారు.

రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలకు చెందిన వారు జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో, జీహెచ్‌ఎంసీ పరిధిలోని వారు కమిషనర్ కార్యాలయం లేదా హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి డీసీ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద లక్ష రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. తెలంగాణలో గతంలో 1,030 బార్లు ఉండగా వీటికి అదనంగా 159 బార్లు ఏర్పాటు కానున్నాయి.

ఎక్సైజ్‌ శాఖ కేవలం ఒకే ఒక్క పేజీ ద్వారా బార్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. లాటరీ ద్వారా ఎంపికైన వారు కేవలం మూడు నెలల్లో ఎక్సైజ్‌ శాఖ నిబంధనలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మరో రెండు నెలలు గ్రేస్ పీరియడ్ గా ఉంటుంది. ఎక్సైజ్‌ శాఖ నిబంధనలు అన్నీ పూర్తి చేసిన వారికి మాత్రమే బార్ లైసెన్స్ ఇవ్వనున్నట్టు తెలిపింది.