https://oktelugu.com/

దేశ చరిత్రలో ఈ దృశ్యాన్ని ఎప్పుడూ చూడలేం

దేశ చరిత్రలో ఇప్పటివరకు చూడని సీన్‌. దేశ చరిత్రలో కనీవినీ ఎరగని అపురూప దృశ్యాలు గణతంత్ర దినోత్సవం వేళ ఆవిష్కృతం అయ్యాయి. సాధారణంగా గణతంత్ర దినోత్సవం నాడు నిర్వహించే వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాల పరేడ్‌కు దీటుగా ట్రాక్టర్ల ప్రదర్శన కొనసాగుతోంది. ఒకవంక శకటాలు, త్రివిధ దళాల ఆయుధ సంపత్తి పరేడ్‌కు దీటుగా- మరోవంక రైతులు తమ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ ట్రాక్టర్లతో నిర్వహిస్తున్న కిసాన్ ర్యాలీ దేశ రాజధానిలో కొనసాగుతోంది. ఒకేరోజు ఒకే సందర్భంలో చోటు చేసుకున్న […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 26, 2021 / 02:04 PM IST
    Follow us on


    దేశ చరిత్రలో ఇప్పటివరకు చూడని సీన్‌. దేశ చరిత్రలో కనీవినీ ఎరగని అపురూప దృశ్యాలు గణతంత్ర దినోత్సవం వేళ ఆవిష్కృతం అయ్యాయి. సాధారణంగా గణతంత్ర దినోత్సవం నాడు నిర్వహించే వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాల పరేడ్‌కు దీటుగా ట్రాక్టర్ల ప్రదర్శన కొనసాగుతోంది. ఒకవంక శకటాలు, త్రివిధ దళాల ఆయుధ సంపత్తి పరేడ్‌కు దీటుగా- మరోవంక రైతులు తమ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ ట్రాక్టర్లతో నిర్వహిస్తున్న కిసాన్ ర్యాలీ దేశ రాజధానిలో కొనసాగుతోంది. ఒకేరోజు ఒకే సందర్భంలో చోటు చేసుకున్న ఈ రెండు వేర్వేరు దృశ్యాలు దేశ అసలు సిసలు శక్తి సామార్థ్యాలకు అద్దం పట్టింది.

    Also Read: గుజరాత్‌లో అదే జరిగితే.. మోడీషాల పరువు పోయినట్లే..!

    కేంద్రం దేశవ్యాప్తంగా అమలు చేయదలిచిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఉత్తరాది రాష్ట్రాల రైతులు మహోద్యమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. రోజుల తరబడి కొనసాగిన వారి దీక్షల ప్రభావంతో కేంద్రం దిగి వచ్చింది. మూడు వ్యవసాయ బిల్లులను అమలు చేయడాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకుంది. అంతకుముందే- దేశ రాజధానిలో ట్రాక్టర్లతో ర్యాలీని నిర్వహించడానికి దేశ అత్యున్నత న్యాయస్థానం రైతులకు అనుమతి ఇచ్చింది.

    సుప్రీం కోర్టు పర్మిషన్‌ ఇవ్వడంతో ప్రస్తుతం ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ల ప్రదర్శన కొనసాగుతోంది. జై జవాన్.. జై కిసాన్ అంటూ నినదిస్తూ ముందుకు సాగుతున్నారు. దేశ రక్షణ వ్యవస్థ ఎంత బలమైందో నిరూపించేలా త్రివిధ దళాలకు చెందిన శకటాలు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగస్వామ్యం అయ్యాయి. అత్యాధునికమైన రాఫెల్ జెట్ ఫైటర్లతో పాటు రుద్ర, సుదర్శన్, రక్షక్, ఏకలవ్య, బ్రహ్మాస్త్ర, గరుడ వంటి హెలికాప్టర్ల ద్వారా దేశ రక్షణ వ్యవస్థ ఎంత పకడ్బందీగా ఉందనేది స్పష్టం చేస్తున్నాయి. నౌకాదళం తరఫున ఐఎన్ఎస్ విక్రాంత్‌ శకటాన్ని పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అదే సమయంలో రైతుల కిసార్ ర్యాలీ కొనసాగుతోండటం ఓ అనూహ్య సన్నివేశానికి వేదికగా నిలిచింది.

    Also Read: తెలంగాణలో ‘వైసీపీ-షర్మిల’కు సాధ్యమేనా?

    ఇదిలావుండగా.. రైతులు నిర్వహిస్తున్న కిసాన్ ర్యాలీ కొన్నిచోట్ల ఉద్రిక్తంగా మారింది. రైతులను నియంత్రించడానికి ఢిల్లీ పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించాల్సి వచ్చింది. ఢిల్లీ -గ్రేటర్ నొయిడా సరిహద్దుల్లో ఈ ఘటన చోటు చేసుకోవడం ఉద్రిక్తంగా మారింది. ఘాజీపూర్ వైపు నుంచి ఢిల్లీకి ప్రవేశించడానికి రైతులు వేలాదిమంది తరలిరావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గడువు కంటే ముందే వారు ఢిల్లీలోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా.. అదుపు చేయడానికి పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. ఫలితంగా అక్కడ కొంత ఆందోళనకర వాతావరణం నెలకొంది.

    మరోవైపు.. ర్యాలీ నిర్వహించుకునేందుకు పర్మిషన్ ఇచ్చిన సుప్రీం కోర్టు.. రైతులెవరూ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేలా వ్యవహరించకూడదనే ఆంక్షలు పెట్టింది. నిర్దేశిత మార్గాల్లోనే ర్యాలీని నిర్వహించాలని ఢిల్లీ పోలీసులు ఇదివరకే జారీ చేశారు. మూడు మార్గాల్లో మాత్రమే ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించడానికి అనుమతి ఇచ్చారు. టిక్రి వైపు నుంచి ఢిల్లీలో ప్రవేశించే ట్రాక్టర్లు నంగ్లోయ్, నజఫ్‌గఢ్, వెస్టర్న్ ఫెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్ మీదుగా బయటికి వెళ్లిపోవాల్సి ఉంటుంది. అలాగే ఘాజీపూర్ వైపు నుంచి వచ్చే ట్రాక్టర్లు 56 ఫీట్ రోడ్ వరకు వెళ్లి మళ్లీ కుండ్లీ-–ఘజియాబాద్, పల్వల్ ఎక్స్‌ప్రెస్ వే మీదుగా వెళ్లిపోవాల్సి ఉంటుంది.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్