Homeగెస్ట్ కాలమ్ఏకశిలా నగరిపై ఎగిరేది ఎవరి జెండా?

ఏకశిలా నగరిపై ఎగిరేది ఎవరి జెండా?

– గ్రేటర్​ వరంగల్​ ఎలక్షన్లకు రెడీ అయిన పార్టీలు
– హైదరాబాద్​ తర్వాత జరిగే అవకాశం
-డెవలప్​మెంట్​ నినాదంతో అధికార పార్టీ
-ప్రభుత్వ వ్యతిరేకత, కబ్జాలు, డబుల్​ బెడ్రూం ఇండ్లు, ఎల్​ఆర్​ఎస్​లే ప్రతిపక్షాల వెపన్స్​
– యూత్​, ఉద్యోగుల ఓట్లే కీలకం

వరంగల్​ నగరంలో  గ్రేటర్​ ఎలక్షన్​ వార్​కు రంగం సిద్ధమైంది… నవంబర్​ తర్వాత ఎప్పుడైనా జరుగొచ్చని అధికార పార్టీ నేతలు లీకులు ఇస్తుండడంతో ఆశావహులు అస్త్రాలు రెడీ చేసుకుంటున్నారు.  మూడు ప్రధాన పార్టీలు టీఆర్ఎస్​, కాంగ్రెస్​, బీజేపీ ఇప్పటికే గ్రౌండ్​వర్క్​ షురూ చేశాయి. అధికార పార్టీ అభివృద్ధి నినాదంతో జోర్దార్​గా ముందుకెళ్తుండగా,  ప్రభుత్వ వ్యతిరేకత, లీడర్ల కబ్జాలు,  పేదలకు అందని డబుల్​ బెడ్​రూం ఇండ్లు ,  ఉద్యోగ నోటిఫికేషన్లు,  గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, మొన్నటి వరదలతో చిన్నాభిన్నమైన సిటీ పరిస్థితిని ప్రజల్లోకి తీసుకెళ్లి అధికార పార్టీకి చెక్ పెట్టాలని  ప్రతిపక్షాలు భావిస్తున్నాయి.

Also Read: కేసీఆర్ సై..తొడగొడితే పడగొడుతాడట

+గ్రేటర్​ బ్యాక్​గ్రౌండ్​..
……………………..
2015లో చుట్టుపక్కల ఉన్న 42 గ్రామాలను కలిపి 58 డివిజన్లతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటైంది. 2016లో 58 డివిజన్లకు ఎలక్షన్లు జరుగగా.. టీఆర్ఎస్  44,  కాంగ్రెస్ 4, సీపీఎం, బీజేపీ చెరొకటి,  8 స్థానాల్లో ఇండిపెండెంట్లు పాగా వేశారు. టీఆర్ఎస్​ అభ్యర్థి నన్నపునేని నరేందర్​ మేయర్​గా ప్రమాణం చేశారు. 2018లో ఆయన వరంగల్​ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలువగా.. అప్పటి నుంచి  గుండా ప్రకాశ్​రావు పదవిలో కొనసాగుతున్నారు. ఈక్రమంలోనే టీఆర్​ఎస్​ కార్పొరేటర్​ ఎంబాడి రవీందర్​ కాంగ్రెస్​లోకి వెళ్లిపోగా.. కాంగ్రెస్​ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్​  టీఆర్ఎస్ లోకి జంప్​ అయ్యారు.

+పవరే కారుకు ప్లస్​..​
……………………..
మరోసారి గ్రేటర్​పై జెండా ఎగురవేయడానికి అధికార పార్టీ సర్వశక్తులు ఒడ్డే అవకాశం ఉంది.  ఏదేమైనా అన్ని ఎలక్షన్లు గెలిచితీరాలని సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్  పదేపదే తమ పార్టీ లీడర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు.  గత ఎన్నికల్లో భారీ విజయం అందుకున్న గులాబీ పార్టీ ఇప్పుడు కూడా ప్రతిపక్షాలను సింగిల్​ డిజిట్​కే పరిమితం చేసేలా స్కెచ్​ వేస్తోంది.  ఓటర్లను ఆకట్టుకోవడానికి మరిన్ని వరాలు కురిపించవచ్చు. మనీ, మందు ఎందులోనూ తగ్గే చాన్స్​లేకపోవచ్చని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఎలక్షన్లకు నోటిఫికేషన్​ రాకముందే భద్రకాళి బండ్​,  పార్కులు, మోడ్రన్​ టాయిలెట్లు, డబుల్​బెడ్​రూంలను ఓపెనింగ్​ చేసేలా పావులు కదుపుతోంది. అలాగే  కాజీపేట ఫాతిమానగర్​ రెండో బ్రిడ్జి పనులు చకచకా కొనసాగిస్తున్నారు.

+కాంగ్రెస్​ సత్తా చాటేనా
…………………………..
గత ఎన్నికల్లో కేవలం 4 డివిజన్లే గెలిచిన హస్తం పార్టీ ఈసారి సత్తా చాటాలని భావిస్తోంది. ఇప్పటికే డివిజన్ల వారీగా కమిటీలు వేశారు.  అధికార పార్టీ లీడర్ల కబ్జాలతోనే  వరదలు వచ్చాయని కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్​ రెడ్డి తదితరులు ఫైర్​ అయ్యారు. అధికార పార్టీలోని వర్గపోరును కూడా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే తూర్పు నియోజకవర్గంలో మాజీ మంత్రి కొండా సురేఖ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. తమవల్లే గత ఎన్నికల్లో తూర్పు కార్పొరేటర్లు అంతా గెలిచారని, ఇప్పడు వాళ్లకు అంతా సీన్​ లేదని మాటల దాడి పెంచారు.  రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ఎల్​ఆర్​ఎస్​, కొత్త రెవెన్యూ చట్టం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలపై నిరసనలు, ధర్నాలతో సిటీని హోరెత్తించారు. రోజుకో ఆందోళన కార్యక్రమంతో గ్రేటర్​ జనాల మనస్సు గెలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Also Read: దుబ్బాక: టీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ అభ్యర్థిగా టీఆర్ఎస్ నేత?

+మోడీ చరిష్మానే నమ్ముకున్న బీజేపీ..
………………………….
గత ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానానికే పరిమితమైన బీజేపీ.. ఈసారి కొత్త ఉత్సాహంతో ముందుకెళ్తోంది. మోడీ ప్రభుత్వం చేపట్టిన 370 ఆర్టికల్​ రద్దు, ఆయోధ్య రామాలయ నిర్మాణం తదితర కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓవర్గం ఓట్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.  లోకల్​గా రావు పద్మ, ఎం.ధర్మారావు, ఇనుగాల రాకేశ్​రెడ్డి తదితర నేతల్లో వర్గపోరు ఉన్నప్పటికీ ఎవరికీ వారుగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై స్పందిస్తున్నారు. గ్రేటర్​ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకునే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​, నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ తదితరులు ఇక్కడ పర్యటించి టీఆర్ఎస్​లీడర్ల కబ్జాలపై ఘాటుగా వ్యాఖ్యానించడంతో సిటీలో పొలిటికల్ హీట్​పెరిగింది.

+రిజర్వేషన్లు మారేనా.. డివిజన్లు పెరిగేనా..
…………………………
జనవరిలో రాష్ట్రంలోని 13కార్పొరేషన్ల మేయర్​ పదవులకు రిజర్వేషన్లు ప్రకటించారు. అందులో గ్రేటర్​ వరంగల్ బీసీ జనరల్​ వచ్చింది. అయితే ప్రస్తుతం ఎన్నికలకు తక్కువ టైం ఉండడంతో గత ఎన్నికల రిజర్వేషన్ల కొనసాగించే అవకాశం కనబడుతోంది. అలాగే డివిజన్లను 58నుంచి 66కు పెంచే అవకాశాలు కూడా లేవు. పాత 58డివిజన్లకే ఎలక్షన్లు జరిగే చాన్స్​ పుష్కలంగా ఉంది.

+ఈవీఎం?.. బ్యాలెట్​…?
……………………………..
కరోనా నేపథ్యంలో ఈసారి బ్యాలెట్​కే మొగ్గు చూపే అవకాశం కనబడుతోంది. హైదరాబాద్​లో మెజారిటీ పార్టీలు బ్యాలెట్​కే మొగ్గుచూపడం..ఈసీ కూడా ఒప్పుకోవడంతో  వరంగల్​లో కూడా బ్యాలెట్​ వారే ఉండనుంది.

పార్టీల బలబలాలు
––––––––––––
టీఆర్ఎస్
…………..

ప్లస్​పాయింట్లు​
+​  చేతిలో పవర్​ ఉండడం బోనస్​
+వరాల జల్లు కురిపించి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం
+అభివృద్ధి పనులు.. భారీగా కేడర్​

మైనస్​ పాయింట్లు
+లోకల్​ లీడర్ల కబ్జాల నేపథ్యంలో వ్యతిరేకత
+సిటీ అనుకున్నంతగా డెవలప్​కాకపోవడం
+ తూర్పులో వర్గపోరు తీవ్రంగా ఉండడం

Also Read: కేంద్రం అలర్ట్.. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి..!

కాంగ్రెస్​
……………
ప్లస్​ పాయింట్లు
+ రెండో పెద్ద పార్టీ.. బూత్​ స్థాయిలో క్యాడర్​ఉండడం
+ టీఆర్​ఎస్​లీడర్ల అనైక్యత, కబ్జాలు
+యూత్​, ఉద్యోగుల్లో ప్రభుత్వం నైరాశ్యం

మైనస్​ పాయింట్లు
+వరుస ఓటములతో శ్రేణుల్లో నిరాశ
+సిటీ మొత్తానికి పెద్దన్న లాంటి లీడర్​లేకపోవడం
+పార్టీలో లీడర్ల మధ్య విభేదాలు

బీజేపీ
……….
ప్లస్​ పాయింట్లు
+ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అమృత్​, స్మార్ట్​సిటీ స్కీంల అమలు, కేఎంసీ సూపర్​స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు
+మోడీ చరిష్మా​… డివిజన్లలో యూత్​ చేరికలు

మైనస్​ పాయింట్లు
+లోకల్​గా చరిష్మా ఉన్న లీడర్​లేకపోవడం
+సామాన్య జనంలోకి చొచ్చుకపోకపోవడం
+పలు డివిజన్లలో ముస్లిం ఓటు బ్యాంకు అధికంగా ఉండడం

-భాషవేణి శ్రీనివాస్

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

2 COMMENTS

Comments are closed.

RELATED ARTICLES

Most Popular