దేశంలో సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఎవరినీ వదలని కరోనా బారిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కొన్ని రోజుల క్రితం పడిన సంగతి విదితమే. 74 ఏళ్ల వయస్సులో 110 కిలోల బరువు ఉన్న ట్రంప్ వైరస్ నుంచి సులువుగానే కోలుకున్నారు. కేవలం మూడు రోజుల చికిత్సతో ట్రంప్ కోలుకోవడానికి మందులే ప్రధాన కారణమని తెలుస్తోంది. నూతన పద్ధతిలో చికిత్స తీసుకున్న ట్రంప్ కరోనా విషయంలో ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.

వాల్టర్ రీడ్ హాస్పిటల్ లో చికిత్స పొందిన ట్రంప్ తనలో కరోనా వైరస్ కు సంబంధించిన చాలా లక్షణాలు కనిపించాయని వెల్లడించారు. రోజురోజుకు టెక్నాలజీ అభివృద్ధి చెందుతోందని.. రోగాలపై వేగంగా పని చేసే ఎన్నో మందులు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. 9 డ్రగ్స్ ను వినియోగించి వైద్యులు ట్రంప్ కు కరోనా తగ్గించడం కోసం చికిత్స అందించారు. తక్కువ సమయంలో చికిత్స అందించి కోలుకునే విధంగా చేశారు.
రెగ్న్ కోవ్2 అనే ప్రయోగాలు చేస్తున్న డ్రగ్ ను కూడా ట్రంప్ కు ఇచ్చారు. ఇమ్యునిటీని పెంచేందుకు యాంటీబాడీల కొరకు ఈ డ్రగ్ ను ఉపయోగించారు. డెక్సామెథాసోన్ అనే స్టెరాయిడ్ ను కూడా చికిత్స లో భాగంగా ట్రంప్ కు ఇచ్చారు. తీవ్రమైన కరోనా కేసుల్లో మాత్రమే వినియోగించే రెమిడిసివర్ ను కూడా ట్రంప్ కు చికిత్స కొరకు ఉపయోగించడం గమనార్హం.
వీటితో పాటు కరోనా నుంచి కోలుకోవడానికి ఇమ్యూనిటీ విషయంలో ఉపయోగపడే విటమిన్ ద్ ట్రంప్ కు ఇచ్చారు. నిద్రలేమి సమస్య నివారణిగా ఉపయోగపడే మెలాటోనిన్ ను, ముక్కు లోపల ప్లాస్టిక్ ట్యూబ్ ద్వారా సప్లిమెంటరీ ఆక్సిజన్ ను, యాంటీ వైరల్ ఇమ్యూనిటీ పెంచడానికి వినియోగించే జింక్ ను, గుండెలో మంటను తగ్గించడం కోసం వినియోగించే ఫామోటైడీన్ ను, ఊపిరితిత్తుల్లో రక్త కణాలు గడ్డ కట్టకుండా ఉండటం కోసం ఆస్పిరిన్ ను ఇచ్చారు.