https://oktelugu.com/

ఈ ప్రపంచంలో ఏది గొప్పది?

“ఇందాక మందారచెట్టుకున్న ఒకే ఒక పువ్వు అప్పుడే పక్కనున్న తులసి చెట్టు లాగేసుకుందే?” వీధిలో వాకింగ్ చేస్తోంటే, ఒక స్కూల్ టీచరు ఇంటిముందు సహచరి ఆగి బాధపడింది. ఈ దేశంలో ఇంతే. ప్రతి పక్షి, జంతువు, మొక్క, వస్తువు, మనిషి, ప్రాంతం.. ఇట్లా ప్రతీదీ అయా విషయాల్లో తమ ప్రత్యేకతని కలిగివుంటాయి. కానీ ఈ దేశంలో మాత్రం గొప్పవైపోతాయి, పవిత్రతని ఆపాదించుకుంటాయి, మహిమాన్వితమైపోతాయి. లేని విలువని లాగేసుకుని, ఇతరుల విలువని దొంగిలించి.. అవి ఉన్నతమైనవిగా పూజలందుకుంటూ వుంటాయి. […]

Written By:
  • NARESH
  • , Updated On : January 17, 2021 10:03 am
    Follow us on

    “ఇందాక మందారచెట్టుకున్న ఒకే ఒక పువ్వు అప్పుడే పక్కనున్న తులసి చెట్టు లాగేసుకుందే?” వీధిలో వాకింగ్ చేస్తోంటే, ఒక స్కూల్ టీచరు ఇంటిముందు సహచరి ఆగి బాధపడింది.

    ఈ దేశంలో ఇంతే. ప్రతి పక్షి, జంతువు, మొక్క, వస్తువు, మనిషి, ప్రాంతం.. ఇట్లా ప్రతీదీ అయా విషయాల్లో తమ ప్రత్యేకతని కలిగివుంటాయి. కానీ ఈ దేశంలో మాత్రం గొప్పవైపోతాయి, పవిత్రతని ఆపాదించుకుంటాయి, మహిమాన్వితమైపోతాయి. లేని విలువని లాగేసుకుని, ఇతరుల విలువని దొంగిలించి.. అవి ఉన్నతమైనవిగా పూజలందుకుంటూ వుంటాయి.

    Also Read: టీమిండియా యువ త్రయం.. అసీస్ కు చమటలు

    ఆవుకన్నా గేదెపాలు అన్ని రకాలుగా వుత్తమమైనవి, అందరూ తాగేదీ, అవే. కానీ చిత్రంగా ఏకంగా తల్లిగా ఒక మనిషి ఇచ్చె పాలకన్నా ఉన్నతమైనవైనాయి. దానికోసం మనిషినే చంపే సంస్కృతి తయారైంది.

    భూమ్మీద ప్రతి మొక్కా దాని విలువ అది కలిగివుంది, కానీ తులసిచెట్టు పూజనీయమైపోయింది. ఆదెంత గొప్పదంటే రోజూ కడుపునింపి మనిషిని ప్రాణాల్తో నిలబెట్టే వరిమొక్క కన్నా గొప్పది?!

    పందితో పాటు వీధి వాడల మురికిని తింటూ మనిషిని అంటిపెట్టుకునే కాకి అనే పక్షికన్నా నెమలి సమున్నతమైనది ఎందుకవుతుందో తెలియదు.

    సమస్త మానవాళికి తిండిపెట్టి, వస్తువులు తయారుచేసే మనుషులకు చెందిన కులాలకన్నా పనికిరాని మాటలు చెప్పి పొట్టపోసుకునే మనుషుల కులాలు ఎందుకు పైన వున్నాయో చెప్పలేరు.

    చిన్నా పెద్దా, పల్లె పట్నం మాట్లాడుకునే మన భాషలు గాకుండా ఒక్కశాతం కూడా రోజువారీ మాట్లాడబడని సంస్కృతం పవిత్ర భాష ఎట్లైతదో తెలియదు.

    మనకు తాగునీరుగా నరాల్లో రక్తమై పారి, మన పంటలకు నీరుగా మన కండరాల్ని ఇచ్చిన మన నదీనదాలు గాకుండా గంగానది మాత్రమే ఎందుకు పవిత్రమైనదో అర్థంకాదు.

    అమ్మతో సమానంగా ప్రేమించడమేగాక, ఏకంగా శరీరాన్ని పంచి, ఆకలయికకు రూపంకూడా ఇవ్వగల జీవన సహచరికన్నా తల్లిదండ్రులు ఎందుకు పవిత్రమైనారో తెలియదు.

    భూమ్మీద అత్యంత పెద్ద నదులు, భూభాగాలూ, మైదానాలు, పర్వతాలు, సరస్సులు, వింతలు విశేషాలుండగా మనదేశమే ఎందుకు పుణ్యభూమి అయ్యిందో తెలియదు.

    Also Read: గ్రేటర్ లొల్లి మళ్లీ మొదలైనట్టే.. మేయర్ ఎవరికి.?

    మనకి ఫలానా రోజులు, సమయాలు, ఘడియలు, దిక్కులు, ప్రాంతాలు, శబ్దాలు, దుస్తులు, ఆభరణాలు, చివరికి సొంత శరీరంలోని కొన్ని అవయవాలు శుభప్రదమైనవిగా, మరికొన్ని అమంగళకరమైనవి ఎందుకయ్యాయో తెలియదు.

    దాదాపు మనలో అందరూ చదువుకున్నాం. కానీ ఎన్నడూ ఎందుకు? అని ఆలోచించం. గమనించి చూడండి, మనకు ప్రాధమికంగా వివక్ష నరరాన జీర్ణించుకుని వుంటుంది, దాన్ని దాటి ఆలోచించే కనీస ప్రశ్నాతత్వం వుండదు.

    ప్రశ్న మనిషిని పశువునుండి వేరు చేస్తుంది. పశువు యజమాని ఎలా చెబితే అలా వింటుంది. మనం మన తల్లిదండ్రులు, సమాజం ఎలా చెబితే అలా నడుచుకుంటాం. ఒక్కోసారి పశువుకన్నా హీనంగా వాటిని అర్థంలేకుండా మరింత గట్టిగా నిలబెట్టుకుంటాం.

    -సిద్ధార్థి