మహేష్ బాబు గ్లామర్ సీక్రెట్ చెప్పిన మంచు విష్ణు

భారతదేశంలోనే అందరి హీరోలను ఒక వరుసలో నిలబెడితే మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అందంలో చందంలో అచ్చం హీరోలా ఉంటాడు. ఒక హాలీవుడ్ హీరోను తలపిస్తుంటాడు. బాలీవుడ్ హీరోలు సైతం అసూయ పడేలా మహేష్ బాబు ఉంటాడు. అలాంటి అందం చందం మహేష్ బాబు సొంతం. Also Read: సింగర్ సునీత భర్త ఆస్తుల ఎంతో తెలుసా? మహేష్ బాబు అందం సీక్రెట్ ఏంటనేది ఎవరికీ తెలియని రహస్యం. అయితే తాజాగా మహేష్ బాబు […]

Written By: NARESH, Updated On : January 17, 2021 10:05 am
Follow us on

భారతదేశంలోనే అందరి హీరోలను ఒక వరుసలో నిలబెడితే మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అందంలో చందంలో అచ్చం హీరోలా ఉంటాడు. ఒక హాలీవుడ్ హీరోను తలపిస్తుంటాడు. బాలీవుడ్ హీరోలు సైతం అసూయ పడేలా మహేష్ బాబు ఉంటాడు. అలాంటి అందం చందం మహేష్ బాబు సొంతం.

Also Read: సింగర్ సునీత భర్త ఆస్తుల ఎంతో తెలుసా?

మహేష్ బాబు అందం సీక్రెట్ ఏంటనేది ఎవరికీ తెలియని రహస్యం. అయితే తాజాగా మహేష్ బాబు అందం సీక్రెట్ ఏంటో తాను కనిపెట్టేశాను అని ట్వీట్ చేశారు హీరో మంచు విష్ణు.

తాజాగా విష్ణు సతీమణి వెరోనికా పుట్టినరోజు ఫంక్షన్ లో మహేష్ బాబు-నమ్రతలు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే మహేష్-నమ్రత , విష్ణు-వెరోనికా దంపతులు కలిసి తీసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు మంచు విష్ణు.

Also Read: ‘క్రాక్’కు మరింత లాభం.. ‘ఆహా’ అనిపించేలా?

‘ఈ ఫొటోలోని వ్యక్తి వయసు పెరుగుతున్న కొద్దీ యువకుడిగా మారిపోతున్నాడు. ఆయన అంత అందంగా ఉండడానికి కారణం ఆయన మంచితనమే’ అని క్యాప్షన్ పెట్టాడు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దీనికి స్పందించిన మహేష్ బాబు ‘చాలా మంచి ఆతిథ్యం ఇచ్చినందుకు థ్యాంక్స్’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ఫంక్షన్ లో హీరో గోపీచంద్ సైతం పాల్గొన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్