త్యాగం ఎవ్వరిది? భోగం ఎవ్వరిది ?

చంద మామ కథ చదివిన. హృదయం కదిలించిన సన్నివేశం.. నా మనుసులో చాలా రోజుల నుండి ముసురుకుంటున్న ముచ్చట. ఇదే విషయం లో మీతో పంచుకోవాలని రాస్తున్న. సైనికులు వాళ్ళ జీవితాలను తమ దేశం కోసం ఫణంగా పెట్టి దేశ రక్షణ చేస్తున్నారు. దేశం ఏదైనా,మనిషి గుంపులు గా ,గణాలు గా, జనపధాలుగా, జీవించి రాజ్యం లో సమాజాలుగా బతుకుతున్న క్రమం లో తమ తమ రక్షణ కోసం సైనిక వ్యవస్తను ఏర్పాటు చేసుకున్నారు. దేశాలు సరిహద్దులు […]

Written By: NARESH, Updated On : January 17, 2021 9:57 am
Follow us on

చంద మామ కథ చదివిన. హృదయం కదిలించిన సన్నివేశం.. నా మనుసులో చాలా రోజుల నుండి ముసురుకుంటున్న ముచ్చట. ఇదే విషయం లో మీతో పంచుకోవాలని రాస్తున్న. సైనికులు వాళ్ళ జీవితాలను తమ దేశం కోసం ఫణంగా పెట్టి దేశ రక్షణ చేస్తున్నారు. దేశం ఏదైనా,మనిషి గుంపులు గా ,గణాలు గా, జనపధాలుగా, జీవించి రాజ్యం లో సమాజాలుగా బతుకుతున్న క్రమం లో తమ తమ రక్షణ కోసం సైనిక వ్యవస్తను ఏర్పాటు చేసుకున్నారు. దేశాలు సరిహద్దులు ఏర్పాటు జేసుకున్న తర్వాత పొరుగు దేశాలు పక్క దేశం లో జొరబడి అందిన కాడికి దోచుకోవడం, ప్రజల మాన ప్రాణాలకు హాని జేయడం, భూభాగాన్ని ఆక్రమించడం లాంటివి జరుగకుండా సైనిక వ్యవస్త ఆ సమాజానికి రక్షణగా నిలిచింది

Also Read: ఈ ప్రపంచంలో ఏది గొప్పది?

రెండవ ప్రపంచ యుద్దం దాకా ఇదే విధానం కొనసాగింది . కానీ ప్రపంచ వాణిజ్య సంస్త, ప్రపంచ ద్రవ్య నిధి సంస్త, దంకేల్ డ్రాఫ్ట్, ట్రిప్స్, ట్రిమ్స్,ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, అను బాంబు , హైడ్రోజన్ బాంబులు వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాల దేశాల నాయకులే స్వచ్ఛందంగా అగ్ర దేశాలకు మోకరిల్లుతు అక్కడి పెట్టుబడికి అనుకూలంగా ఇక్కడ తమ దేశం లో ఉన్న వనరులు , భూమి , నీళ్ళు, మానవ వనరులు కారు చౌకగా అప్పగిస్తూ మా దేశం లో నీ పెట్టుబడులు పెట్టు, సరుకులు తయారు చేయి, ఇక్కడే కాదు ఎక్కడైనా అమ్ముకో లాభాలు పిండుకో , మాకు ఎంత కాలుష్యం అయిన వదిలి పో, మాకు ఎన్ని రోగాలైన అంటగట్టి పో , మా చెట్లు, గుట్టలు, నదులు , సామాన్య ప్రజల బ్రతుకు దెరువులు , ఆరోగ్యాలు, ఎంత విధ్వంసం అయినా మాకు ఫరువా లేదు , ఎవ్వరైన ఇదేందని నోరిడిచి అడిగితే మీరు తయారు జేసె ఆయుధాలను కొనుక్కొని వాళ్ళ అంతు చూస్తాం అంటూ ఒప్పందాలు జరుపుకుంటున్నారు. ఇంకా ఆయా దేశాలల్లో అణిచి వేయబడుతున్న ప్రజలు ఏమి ఆలోచిస్తున్నారో, ఏమి కావాలని కోరుకుంటున్నారో తెలుసు కోవడానికి ఆ ప్రజల పైన నిఘా పెట్టి మాకు సమాచారం ఇవ్వండి అంటూ గూగుల్, యాహూ, వాట్స్ అప్ లాంటి కంపనీల తో ఒప్పందం కుదుర్చుకోవాడానికి ఆ కంపనీల ముంగిట క్యూలు కడుతున్నారు.

సైనికుల కాపలా ఒక వైపు సాగుతూనే ఉన్నా వాళ్ళు ముష్కరుల తూటాలకు నేలకు ఒరుగుతూనే ఉన్నా, ఆయా దేశాల వనరులను సంపన్న దేశాలు తుపాకి తూటా పేల్చకుండా , చుక్క రక్తం చిందించ కుండా ప్రజల బతుకు దెరువులను ఊడ్చుకొని పోతూనే ఉన్నాయి. ప్రస్తుతం సైనికుల పరిస్తితి, తమ దేశ పౌరుల పైన్నే తుపాకులు ఎక్కు పెట్టె పరిస్తితి, దేశ వనరులను భావి తరాలకు సైతం మిగులకుండా అప్పనంగా అమ్ముకుంటున్న వాళ్ళకే రక్షణ గా నిలిచే పరిస్తితి. సైనికుల త్యాగ ఫలం ఆ దేశ ప్రజల కంటే ఆ దేశ వనరులను ప్రజల ఇస్టా అయిస్టాలతో సంబంధం లేకుండా బడా పెట్టుబడి దార్లకు దారదాత్తం చేస్తున్న అధికార వర్గాలకే దక్కుతున్నది.

Also Read: గ్రేటర్ లొల్లి మళ్లీ మొదలైనట్టే.. మేయర్ ఎవరికి.?

ఏ దేశం లో అయినా ఆ దేశం లో ఉన్న వనరులను కాపాడుతున్నది ఆ దేశ మూల వాసులే. ఉత్పత్తి తో సంబంధం ఉన్న వాళ్ళే ఆ వనరులను ఇంతవరదాక కాపాడుతూ వస్తున్నారు. ఇప్పుడేమో ఉత్పత్తి తో ఎలాంటి సంబంధం లేని రికామి వర్గం అరిచేతిలో స్వర్గం చూపెట్టే మాటలు చెప్పుతూ ఉన్నన్ని రోజులు అధికారం లో కొనసాగడానికి , ఆ తర్వాత మళ్ళీ అధికారం లోనికి రావడానికి అవసరమైనంత డబ్బు పోగేసుకొనే పనిలో తలమునకలై ఉంటున్నారు. ఎక్కడి సైన్యం ఎక్కడి త్యాగం! త్యాగం ఎవ్వరిది? భోగం ఎవ్వరిది ?

-వీరగోని పెంటయ్య

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్