కాంగ్రెస్ తో వివాహం.. మోడీకి ప్రేమలేఖలు

రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలే ఉంటాయని అంటారు. రాజకీయ దురంధరుడిగా పేరుగాంచిన ఆ సీనియర్ నేత మాత్రం ఎప్పుడూ రాజకీయ అధికారానికి దగ్గరగా ఉంటాడు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా దానితోనే అంటకాగుతుంటాడు. అలా తన పార్టీని, పరపతిని ఎల్లకాలం అనుభవిస్తూనే ఉంటాడు. ఆయనే మరాఠా యోధుడు.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్. ప్రతీ ఒక్కరిని అడ్డుపెట్టుకొని రాజకీయం చేయడంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు అందవేసిన చేయి. ప్రస్తుతం మహారాష్ట్రలో కాంగ్రెస్-శివసేన కూటమితో […]

Written By: NARESH, Updated On : June 10, 2020 12:34 pm
Follow us on


రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలే ఉంటాయని అంటారు. రాజకీయ దురంధరుడిగా పేరుగాంచిన ఆ సీనియర్ నేత మాత్రం ఎప్పుడూ రాజకీయ అధికారానికి దగ్గరగా ఉంటాడు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా దానితోనే అంటకాగుతుంటాడు. అలా తన పార్టీని, పరపతిని ఎల్లకాలం అనుభవిస్తూనే ఉంటాడు. ఆయనే మరాఠా యోధుడు.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్.

ప్రతీ ఒక్కరిని అడ్డుపెట్టుకొని రాజకీయం చేయడంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు అందవేసిన చేయి. ప్రస్తుతం మహారాష్ట్రలో కాంగ్రెస్-శివసేన కూటమితో జట్టుకట్టి ప్రభుత్వంలో ఉంటూ.. కేంద్రంలో మోడీకి సన్నిహితంగా మెలగడం ఆయనకే చెల్లింది. చాలాసార్లు శరద్ పవర్ ఏ వైపు ఉన్నాడో కూడా తెలియదు.

ప్రస్తుతం శరద్ పవార్ సోనియాగాంధీ నేతృత్వంలోని ప్రతిపక్షంలో ఉన్నాడు. కానీ చాలా సార్లు ఆయన ప్రధాని నరేంద్రమోడీకి సహాయపడే పనులు చేస్తుంటాడు. ప్రస్తుతం మహారాష్ట్రలో శివసేనతో ఒక కూటమిని ఏర్పరుచుకున్నాడు. కానీ తరుచూ బీజేపీకి మేలు చేసేలా శివసేన పార్టీని వ్యతిరేకిస్తూ లేఖలు రాస్తుంటాడు.

ఇటీవల కరోనా టైంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించిన పీఎం కేర్స్ ఫండ్ ను కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి. ఈ పథకం పారదర్శకంగా లేదని.. నిధుల గోల్ మాల్ జరుగుతోందని దాడి చేశాయి.

కానీ కాంగ్రెస్, ఎన్సీపీతో సహా 17 ప్రతిపక్ష పార్టీలు సమావేశమై కరోనా నియంత్రణ చర్యలపై చర్చించినప్పుడు చివరకు ఆమోదించిన తీర్మానంలో పీఎం కేర్స్ ఫండ్ గురించి ప్రస్తావించలేదు. ఈ విషయంపై కనీసం నోరు కూడా మెదపలేదు. పీఎం కేర్ ఫండ్ గురించి సూచనలు లేవని శరద్ పవార్ నిర్ధారించారు. చర్చ అస్సలు సమస్యపై దృష్టి పెట్టకుండా చూసుకున్నారు.

ఇక ఇదే శరద్ పవార్ ఆ మధ్య నరేంద్రమోడీ ఇంటికి నవ్వుతూ వెళ్లి ప్రతిపక్షాల దాడికి శక్తిని ఇవ్వలేదు. తన సొంత పార్టీ వెలుపల నరేంద్రమోడీకి శరద్ పవార్ మంచి స్నేహితుడిగా ఉన్నారని చాలా మందికి తెలియదు.. మోడీ చాలాసార్లు పవర్ ను అభినందిస్తారు. పవార్ కూడా మోడీని మెచ్చుకుంటారు. చాలా సార్లు మోడీకి ఫేవర్ గా పవార్ వ్యవహరించారు.

దీంతో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని ప్రతిపక్షంలో ఉన్నా కూడా శరద్ పవార్ తను అనుకున్నది సాధించుకోవడం కోసం మోడీతో ప్రేమలో ఉంటూ రాజకీయాల్లో బతకనేర్చాడని విశ్లేషకులు చెబుతున్నారు..

-నరేశ్ ఎన్నం