కీలక ప్రకటన చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల

తెలంగాణలో వైరస్ బారిన పడిన వారికి ఇకపై ఇళ్లలోనే చికిత్స చేయనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. లాక్డౌన్ సడలించడం వల్లనే కరోనా కేసులు పెరిగిపోతున్నాయని తెలిపారు. ప్రజలు జీవనోపాధి కొల్పోవద్దనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలో లాక్డౌన్ మినహాయింపులు ఇచ్చినట్లు తెలిపారు. ప్రజలు అనవసరంగా బయటికి రావద్దని.. వైరస్ బారిన పడొద్దని సూచించారు. ప్రతీఒక్కరు మాస్కులు, భౌతిక దూరం, శానిటైజేషన్ వంటి తగుచర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొందరిలో వైరస్ లక్షణాలు కన్పించడం లేదని తెలిపారు. […]

Written By: Neelambaram, Updated On : June 8, 2020 1:01 pm
Follow us on


తెలంగాణలో వైరస్ బారిన పడిన వారికి ఇకపై ఇళ్లలోనే చికిత్స చేయనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. లాక్డౌన్ సడలించడం వల్లనే కరోనా కేసులు పెరిగిపోతున్నాయని తెలిపారు. ప్రజలు జీవనోపాధి కొల్పోవద్దనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలో లాక్డౌన్ మినహాయింపులు ఇచ్చినట్లు తెలిపారు. ప్రజలు అనవసరంగా బయటికి రావద్దని.. వైరస్ బారిన పడొద్దని సూచించారు. ప్రతీఒక్కరు మాస్కులు, భౌతిక దూరం, శానిటైజేషన్ వంటి తగుచర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొందరిలో వైరస్ లక్షణాలు కన్పించడం లేదని తెలిపారు. పదేళ్లలోపు చిన్నారులు, వయస్సు పైబడిన వారు ఇళ్లకే పరిమితం కావాలని.. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచించారు. రోడ్లపైకి వచ్చేటప్పుడు ప్రతీఒక్కరు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నవారిని గుర్తించి హోం క్వారంటైన్ చేయాలని వైద్యాశాఖ అధికారులకు సూచించారు. హోమ్ క్వారంటైన్ కు కేంద్రం అనుమతి ఇచ్చిందని తెలిపారు. రోగ లక్షణాలు తక్కువగా ఉండి పాజిటివ్ ఉన్నవారికి మూడురోజులపాటు ఇళ్లలోనే చికిత్స అందించనున్నట్లు తెలిపారు. కేంద్రం సూచించిన మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ఈటల తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం నేపథ్యంలో ఇళ్ల పక్కనే ఉండే కాలనీ వాసులు, అపార్ట్ మెంట్ వాసులు సహకరించాలని కోరారు. కరోనా జబ్బు బారిన పడిన వారిని బహిష్కరించే వంటి చర్యలకు పాల్పడొద్దంటూ సూచించారు. ప్రజలు అనవసర భయాందోళనలకు లోను కావద్దని మంత్రి సూచించారు.

పాజిటివ్ కేసుల్లో జ్వరం వచ్చిన వారికి మాత్రమే ఆస్పత్రుల్లో చికిత్స చేస్తామని తెలిపారు. మిగతా వారికి ఇళ్లల్లోనే చికిత్స అందుతుందని పేర్కొన్నారు. కరోనా గాలి ద్వారా సోకదని స్పష్టం చేశారు. కరోనా కేసులు పెరిగిపోవడంతో గాంధీ ఆస్పత్రి నిండుకోవడం, కరోనా కేసులు పెరిగిపోతుండటంతో వైద్యులపై పనిభారం పడుతుందన్నారు. వైద్యులపై ఒత్తిడి తగ్గించేందుకే హోం క్వారంటైన్ చేయనున్నట్లు తెలిపారు. లాక్డౌన్ సడలింపులు ప్రజల జీవనోపాధి కోల్పోకుండా ఉండేందుకే చేశారన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి అనవసరంగా రోడ్లపైకి వచ్చి వైరస్ బారిన పడొద్దని సూచించారు.