https://oktelugu.com/

బాలయ్యతో నాకు ఎలాంటి విభేదాలు లేవు: నాగబాబు

తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని రోజులుగా కోల్డ్ వార్ నడుస్తోంది. సోషల్ మీడియా వేదికగా మెగా అభిమానులు, నందమూరి అభిమానులు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. చిరంజీవి ఆధ్వర్యంలో జరిగిన సినీ ప్రముఖుల సమావేశానికి, ఆపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కలిసినప్పుడు తనను ఆహ్వానించకపోవడంపై అగ్ర కథానాయకుడు బాలకృష్ణ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి హైదరాబాద్‌లో భూములు పంచుకుంటున్నారా? అని బాలయ్య తీవ్ర ఆరోపణలు […]

Written By:
  • admin
  • , Updated On : June 8, 2020 / 02:16 PM IST
    Follow us on


    తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని రోజులుగా కోల్డ్ వార్ నడుస్తోంది. సోషల్ మీడియా వేదికగా మెగా అభిమానులు, నందమూరి అభిమానులు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. చిరంజీవి ఆధ్వర్యంలో జరిగిన సినీ ప్రముఖుల సమావేశానికి, ఆపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కలిసినప్పుడు తనను ఆహ్వానించకపోవడంపై అగ్ర కథానాయకుడు బాలకృష్ణ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి హైదరాబాద్‌లో భూములు పంచుకుంటున్నారా? అని బాలయ్య తీవ్ర ఆరోపణలు చేయడంతో టాలీవుడ్‌లో అలజడి రేగింది. బాలయ్య విమర్శలను మెగా బ్రదర్ నాగబాబు ఖండించడంతో ఈ వివాదం నందమూరి, మెగా కుటుంబాల మధ్య కోల్డ్‌ వార్ కు దారి తీసింది. ఈ విషయంపై నాగబాబు ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.

    బాలకృష్ణతో తనకెంలాంటి గొడవలు కానీ, విభేదాలు కానీ లేవని స్పష్టం చేశారు. బాలయ్యతో తనకు పెద్దగా పరిచయమే లేదని, కలిసింది కూడా తక్కువే అన్నారు. బాలకృష్ణ ఆవేశంలో అలా మాట్లాడారు తప్పితే, ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేశారని అనుకోవడం లేదన్నారు. ఈ ఆరోపణలు తాను ఖండించిన తర్వాత బాలయ్య కూడా సర్థుకున్నారని చెప్పారు. అందుకే దీన్ని పొడిగించలేదని చెప్పారు. సి. కళ్యాణ్, తమ్మారెడ్డి లాంటి వారు సర్థి చెప్పడంతో ఈ గొడవ ముగిసిందని అన్నారు. ఇకపై దీనిపై మాట్లాడి వివాదాన్ని పెద్దది చేయడం తనకు ఇష్టం లేదన్నారు. ఇండస్ట్రీలు గొడవలు టీ కప్పులో తుఫాన్ లాంటివి అని అభిప్రాయపడ్డారు. జూన్‌ 15 నుంచి కొన్ని సినిమాల షూటింగ్స్ మొదలు పెట్టాలని పరిశ్రమ ప్లాన్ చేస్తున్నాయని చెప్పారు. వచ్చే నెల నుంచి పూర్తి స్థాయిలో షూటింగ్స్‌ మొదలయ్యే అవకాశం ఉందన్నారు.