
ఆంధ్రప్రదేశ్‌లో ఒక గమ్మత్తైన గేమ్ ప్లాన్ జరుగుతోంది. అంతర్గత వ్యక్తుల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం.. రాబోయే తిరుపతి ఉప ఎన్నికల్లో చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా కలిసి ఒక గేమ్ ప్లాన్ రూపొందించినట్టు ప్రచారం సాగుతోంది. వారు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.
Also Read: పొత్తు పెట్టుకున్న పార్టే.. పవన్‌కు బ్రేకులు వేస్తుందా..?
మరో వైపు బిజెపి వ్యూహం స్పష్టంగా ఉంది. టీడీపీని ఆంధ్రప్రదేశ్ లో మూడో స్థానానికి నెట్టి ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలని ప్లాన్ చేస్తోంది. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ను నీరుగార్చినట్టే ఏపీలోనూ అదే ప్లాన్ అమలు చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.. తెలంగాణలో రుచి చూసిన విజయం స్ఫూర్తితో తిరుపతిలో అమలు చేసి విజయం సాధించాలని బీజేపీ యోచిస్తోంది. అధికార వైయస్ఆర్సిపికి గట్టి పోటి ఇవ్వడానికి బిజెపి సన్నద్ధమవుతోంది. ఈ ప్రక్రియలో టిడిపిని ప్రధానంగా టార్గెట్ చేసి మూడవ స్థానానికి నెట్టాలని చూస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలలో కాంగ్రెస్ కు జరిగినట్లుగానే టీడీపీని అలానే కొట్టాలని చూస్తోంది.
బీజేపీ చేసిన ప్లాన్ ప్రకారం.. ఆ పార్టీ అభ్యర్థిని ప్రకటించిన తరువాత.. టిడిపి నుంచి కీలకమైన నేతలందరినీ బీజేపీలోకి లాగడానికి ‘ఆపరేషన్ ఆకర్ష్’ ను ప్రయోగించబోతున్నట్టు తెలుస్తోంది. ఆ విధంగా తిరుపతిలో టిడిపిని ఖాళీ చేయాలని బీజేపీ ప్లాన్ చేసినట్లు సమాచారం.
Also Read: పెరుగుతున్న ఏలూరు బాధితులు.. ప్రభుత్వం అలెర్ట్
ఈ ప్రమాదాన్ని ముందే ఊహించిన టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇదే విధమైన వ్యూహాన్ని రచించినట్టు తెలిసింది. కానీ ఈ ప్రణాళిక బీజేపీతో పోలిస్తే అంత మెరుగైనది కాదనే టాక్ వినిపిస్తోంది.
తాజాగా జనసేనాని కూడా జూలు విదిల్చాడు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రదేశాలలో పర్యటించి పవన్‌కళ్యాణ్ అకస్మాత్తుగా తన ఉనికిని చాటుకుంటున్నాడు. చిన్న చిన్న సమావేశాలలో సైతం పాల్గొని ప్రజలకు చేరువ అవుతున్నాడు. అది ఆయనపై క్రేజ్ ను చాటిచెబుతోంది. పవన్ పర్యటనలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బిజెపి దృష్టిలో పడడానికే పవన్ కళ్యాణ్ ఇలా పర్యటనలు పెట్టుకున్నట్టు చంద్రబాబు నాయుడు అనుమానిస్తున్నాడట.. పవన్‌కళ్యాణ్ ఫాలోయింగ్‌ను బిజెపి అర్థం చేసుకుంటే ఆ పార్టీ పిలిచి టికెట్‌ను జనసేనకు వదిలివేస్తుందని చంద్రబాబు ఊహిస్తున్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్ తిరుపతిలో అభ్యర్థిని నిలబెడితే ఆ పార్టీని ఓడించడం సులభం అని చంద్రబాబు భావిస్తున్నాడట. అదే బీజేపీ అభ్యర్థి నిలబడితే తట్టుకోవడం కష్టం అని చంద్రబాబు ఆందోళన చెందుతున్నాడట.. అందుకే పవన్ పర్యటనలకు టీడీపీ మీడియా ఇప్పుడు ఫుల్ హైప్ తెస్తున్నట్టు సమాచారం. జనసేన అభ్యర్థి కనుక తిరుపతిలో నిలబడితే ఖచ్చితంగా వీరి కూటమి మూడవ స్థానానికి పడిపోతుందని బాబు భావిస్తున్నాడు. అప్పుడు రెండవ స్థానాన్ని టిడిపి చేజిక్కించుకొని ప్రతిపక్షంగా కొనసాగవచ్చన్నది చంద్రబాబు అండ్ టీడీపీ మీడియా ప్లాన్ చేసినట్టు తెలిసింది. ఈ వ్యూహంతో రాష్ట్రంలో రెండో స్థానాన్ని నిలుపుకోవాలని చంద్రబాబు కోరుకుంటున్నట్టు సమాచారం.
కాబట్టి, పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా చంద్రబాబు చేతిలో పావుగా మారవద్దని విశ్లేషకులు సూచిస్తున్నారు. సీటు బీజేపీకి వదిలేస్తేనే చంద్రబాబు పతనం ఖాయమవుతుందని సలహా ఇస్తున్నారు. “పవన్ కళ్యాణ్‌కు మద్దతు ఇవ్వడానికి ఇప్పుడు ఎవరూ లేరు. వైఎస్‌ఆర్‌సిపి అతన్ని విస్మరించింది. బిజెపి పవన్ ను నిర్లక్ష్యం చేసింది. చంద్రబాబు మాత్రమే పవన్ ను రాజకీయంగా వాడుకోవడానికి చూస్తున్నాడని ’ ఓ సీనియర్ జర్నలిస్ట్ వ్యాఖ్యానించాడు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
ఇవే కాకుండా జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో బిజెపి అవకాశాలను దెబ్బతీసేందుకు హైదరాబాద్‌లోని వైఎస్‌ఆర్‌సిపి గ్రూపులు టిఆర్‌ఎస్‌కు మద్దతుగా ప్రచారం చేశాయని బీజేపీకి ఉప్పందింది. ఇక స్నేహంగా ఉన్న వైఎస్‌ఆర్‌సిపి, బిజెపిల మధ్య విభేదాలు సృష్టించడం టీడీపీ మీడియా, చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు.. ఇక కేంద్రంలోని బీజేపీ కూడా అధికారంలో ఉన్న వైసీపీతోనే ముందుకెళ్లాలని చూస్తోంది. అంతేకానీ ఓడిన చంద్రబాబు, టీడీపీని పట్టించుకోవడం లేదు. ఎన్నికల్లో పోటీ వరకు పోరాడాలని.. వైయస్ఆర్సిపితో స్నేహం కొనసాగిస్తే మంచిదని బిజెపి పెద్దలు ఆలోచిస్తున్నట్టు తెలిసింది.
కళ్లు మూసుకొని పిల్లి తాగినట్టుగా ఇప్పుడు వైసీపీని ఎదుర్కోలేక పవన్ ను పావుగా వాడాలని చంద్రబాబు, ఆయన అనుకూల టీడీపీ మీడియా తిరుపతి ఎన్నికల వేళ ప్లాన్ చేస్తోంది. చాలా తెలివిగా ఎత్తులు వేస్తున్నారు. అయితే మోడీ, అమిత్ షా బ్యాచ్ వీరి బుట్టలో పడిపోతుంది అనుకుంటే పొరపాటే అని పలువురు సూచిస్తున్నారు.
-నరేశ్