https://oktelugu.com/

ముగిసిన బిగ్ బాస్ ఓటింగ్.. ఎవరికి ఎన్ని ఓట్లు అంటే ?

మూడు నెలలుగా తెలుగు ప్రేక్షకులని అలరిస్తూ ఉన్న క్రేజీ రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 4’ ముగింపు దశకు చేరుకుంది. ఈ సీజన్ విజేత ఎవరన్నది రేపు ప్రసారమయ్యే ఎపిసోడ్ లో తెలిసిపోతుంది. కాగా గత మూడు సీజన్లకి ఏ మాత్రం తగ్గకుండా ఈ ఫినాలే గ్రాండ్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ చివరి వేడుక ఈ రోజు రాత్రి నుండి ప్రారంభమవుతుంది, రేపటి ఎపిసోడ్ ముగింపులో బిగ్ బాస్ తెలుగు […]

Written By:
  • admin
  • , Updated On : December 19, 2020 / 04:35 PM IST
    Follow us on


    మూడు నెలలుగా తెలుగు ప్రేక్షకులని అలరిస్తూ ఉన్న క్రేజీ రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 4’ ముగింపు దశకు చేరుకుంది. ఈ సీజన్ విజేత ఎవరన్నది రేపు ప్రసారమయ్యే ఎపిసోడ్ లో తెలిసిపోతుంది. కాగా గత మూడు సీజన్లకి ఏ మాత్రం తగ్గకుండా ఈ ఫినాలే గ్రాండ్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ చివరి వేడుక ఈ రోజు రాత్రి నుండి ప్రారంభమవుతుంది, రేపటి ఎపిసోడ్ ముగింపులో బిగ్ బాస్ తెలుగు 4 యొక్క టైటిల్ విన్నర్ ని ప్రత్యేక అతిధితో వెల్లడిస్తారు. ఈ సారి కూడా ముఖ్య అతిధిగా చిరంజీవి వస్తారని సమాచారం. ఒక మోస్తరు అంచనాలతో మొదలయిన బిగ్ బాస్ సీజన్ 4 రోజు రోజుకి హైప్ పెంచుకుంటూ ప్రేక్షకులకి బాగానే వినోదం పంచింది.

    Also Read: ఇప్పటికే మూడు పెళ్లిళ్లు.. మళ్లీ ప్రేమలో పడిందట..!

    ఇక షో లో చివరికి టాప్ 5 పోటీదారులుగా అభిజీత్,అఖిల్,అరియానా,హరిక, సోహెల్ మిగిలారు. వీరిలో ఎవరిని విజయం వరిస్తుందో అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఊహాగానాలు చేస్తున్నారు. మొన్నటి వరకు కంటెస్టెంట్స్ కి దక్కిన ఓటింగ్ బట్టి చూసుకుంటే… అభిజీత్ మొదటి ప్లేస్ లో ఉంటూ అరియానా సెకండ్ ప్లేస్ ఉండటం గమనించాం. అయితే ఇవాళ తేలిన వోటింగ్స్ లెక్కల్లో అభిజిత్ కి 42 శాతం రాగ , అరియనా కి 17 శాతం మాత్రమే వచ్చాయట. అనూహ్యంగా సోహెల్ 22 శాతం ఓట్లతో అరియానని వెనక్కి నెట్టి సెకండ్ ప్లేస్ లోకి వచ్చాడట. ఇక అఖిల్ కి 14 శాతం రాగ హారిక 5 శాతం ఓట్లతో చివరి ప్లేస్ లో ఉందట. ఈ వారంలో సోహెల్ చేసిన హడావిడితోనే అతనికి వోటింగ్ పెరిగిందట.

    ఇప్పటివరకు విన్నర్ అభిజీత్ అని, మొదటి రన్నర్ అరియాన అని వేసుకున్న లెక్కలన్నీ పటాపంచలు అయ్యాయి. మీడియా చానెల్స్ లో , యూట్యూబ్ లో , సోషల్ మీడియా లో నిర్వహించిన అన్ని పోల్స్ లలో ఎక్కువ శాతం ఓట్ల షేర్‌తో అభిజిత్‌ విన్నర్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. రెండో స్థానంలో సొహైల్, అరియానాల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఈ రోజు అర్ధరాత్రి కి ఓటింగ్ పక్రియ ముగియనుంది. ఇక ఈ సీజన్ 4 బిగ్ బాస్ విజేతగా అభిజిత్ అవతరించబోతున్నాడనేది స్పష్ఠం అవుతోంది. అయితే రన్నరప్ విషయానికి వస్తే.. సొహైల్ రన్నరప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.

    Also Read: రౌడీ పొలిటీషియన్ గా పవన్… షాకిస్తున్న స్టోరీ లైన్?

    అయితే సోహెల్ కి అరియానా నుంచి గట్టి పోటీ ఉంది. ఇప్పటి వరకు అబ్బాయిలే విన్నర్ అవుతున్నారనే కామెంట్ గట్టిగా వినిపిస్తుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని బిగ్ బాస్ నిర్వాహకులు ‌కనీసం రన్నరప్ అమ్మాయికి ఇవ్వాలనుకుంటే మాత్రం అరియానాకి రన్నరప్ టైటిల్ రావచ్చు. ఆ రకంగా చూస్తే సొహైల్ మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఇక అఖిల్‌కి నాలుగో స్థానం, హారికకు చివరి స్థానాలు లభించవచ్చు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్