https://oktelugu.com/

భారత్-చైనా సరిహద్దులో ఘర్షణ.. అసలు కారణలేంటీ?

భారత్-చైనా సరిహద్దులో సోమవారం రాత్రి 3 గంటల సమయంలో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ నెలకొంది. గాల్వాన్లో ఒకరిపై రాళ్లు రువ్వుకోవడం.. రాడ్లతో దాడికి దిగినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనలో ఒక కర్నల్ స్థాయి అధికారి సంతోష్ బాబుతో పాటు 19 మంది జవాన్లు వీరమరణం పొందారు. చైనాకు చెందిన 43మంది సైనికులు మృతిచెందినట్లు ఆర్మీ అధికారులు పేర్కొంటున్నారు. సరిహద్దు వివాదంపై ఇరుదేశాల మధ్య ఆర్మీ స్థాయిలో ఉన్నతస్థాయి చర్చలు జరుగుతున్న క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకోవడంపై […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 18, 2020 5:12 pm
    Follow us on


    భారత్-చైనా సరిహద్దులో సోమవారం రాత్రి 3 గంటల సమయంలో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ నెలకొంది. గాల్వాన్లో ఒకరిపై రాళ్లు రువ్వుకోవడం.. రాడ్లతో దాడికి దిగినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనలో ఒక కర్నల్ స్థాయి అధికారి సంతోష్ బాబుతో పాటు 19 మంది జవాన్లు వీరమరణం పొందారు. చైనాకు చెందిన 43మంది సైనికులు మృతిచెందినట్లు ఆర్మీ అధికారులు పేర్కొంటున్నారు. సరిహద్దు వివాదంపై ఇరుదేశాల మధ్య ఆర్మీ స్థాయిలో ఉన్నతస్థాయి చర్చలు జరుగుతున్న క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

    గతనెల రోజులుగా చైనా-భారత్ లాఢక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గడిచిన రెండు దశాబ్దాలుగా ఇరుదేశాల మధ్య చెదురుముదురు సంఘటనలు మినహా ఘర్షణలు చోటుచేసుకోలేదు. కొన్నేళ్లుగా ఇరుదేశాల మధ్య రక్తమోడిన సంఘటనలుగానీ ఒక్క తూటా పేలిన ఘటనలు చోటుచేసుకోలేదు. అయితే ఉన్నట్టుంది చైనా భారత్ ను దొంగతీసి 20మంది సైనికులను పొట్టన పెట్టుకోవడంపై యావత్ దేశం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చైనా ఎందుకు ఈ దుస్సాహానికి పూనుకుందనే ప్రశ్న తలెత్తుతోంది.

    భారతదేశానికి చైనాతో అతిపెద్ద సరిహద్దు ఉంది. దాదాపు 3,500కిలోమీటర్ల సరిహద్దు ఇరుదేశాల మధ్య ఉంది. ఇప్పడు ఘర్షణ జరిగిన గాల్వాన్ వివాదం కారణంగా 1962లో ఇరుదేశాల మధ్య యుద్ధానికి దారితీసింది. నాటి నుంచి ఇరుదేశాల సమస్య పరిష్కారం కోసం యత్నిస్తున్నట్లు చెబుతున్నాయి. అయితే ఇటీవల చైనా సరిహద్దులో భారీగా మౌలిక వసతులు, సైనిక శిబిరాలు, రైలు మార్గాలను నిర్మించుకుంటోంది. ఈక్రమంలోనే భారత్ కూడా సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను నిర్మిస్తుంది. ఇదే చైనా కడుపుమంటకు కారణమైనట్లు తెలుస్తోంది.

    భారత్ పాంగాంగ్ సరస్సులోని ఫింగర్ ప్రాంతాల వద్ద ఇటీవల కీలక రోడ్డును నిర్మిస్తోంది. గాల్వాన్ లోయలో దార్బుక్-ష్యోక్ దౌలత్ బేగ్ ఓల్డీలను అనుసంధానిస్తూ మరో రోడ్డును నిర్మిస్తుంది. దీనిపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్ ఆ విషయాన్ని లైట్ తీసుకుంది. ప్రాజెక్టులు పూర్తి చేసేందుకే భారత్ మొగ్గుచూపింది. ఈక్రమంలోనే ఈనెల మొదటి వారంలో పాంగాంగ్ సరస్సు వద్ద ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సంఘటన నేపథ్యంలో ఇరుదేశాలకు చెందిన సైనిక, దౌత్య స్థాయిలో చర్చలు జరిగాయి. ఈ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని భావించారు. ఇందులో భాగంగా కొన్నిప్రాంతాల్లో ఇరుదేశాలు బలగాల ఉపసంహరణ చేస్తున్న క్రమంలోనే చైనా దుర్మార్గానికి పాల్పడినట్లు తెలుస్తోంది. చైనా దుస్సాహసంపై ప్రధాని మోడీ స్పందించకపోవడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నారు. ఈనేపథ్యంలో ప్రధాని మోదీ చైనా విషయంలో ఎలాంటి వైఖరి అవలంభిస్తారనేది ఆసక్తిని రేపుతోంది.