https://oktelugu.com/

కరోనా నేపథ్యంలో రాష్ట్రానికి ఆదాయం లభిస్తుందా?

రాష్ట్ర రెవెన్యూ లోటు ఎన్నడూ లేని విధంగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గత అరేళ్లలో ఇంత పెద్ద మొత్తంలో రెవిన్యూ లోటు సంభవించలేదు. గత ఏడాది సవరించిన అంచనాల ప్రకారం రెవెన్యూ లోటు రూ. 26,646.82 కోట్లు ఉండగా, ఈ ఆర్ధిక సంవత్సరం రూ. 18,434.14 కోట్లు రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా వేశారు. కరోనా నేపథ్యంలో రెవెన్యూ ఆదాయం తగ్గే అవకాశం స్పష్టంగా కనిపిస్తుండటంతో రెవెన్యూ లోటు భారీగా పెరిగుతుందని ఆర్ధిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 17, 2020 / 12:49 PM IST
    Follow us on


    రాష్ట్ర రెవెన్యూ లోటు ఎన్నడూ లేని విధంగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గత అరేళ్లలో ఇంత పెద్ద మొత్తంలో రెవిన్యూ లోటు సంభవించలేదు. గత ఏడాది సవరించిన అంచనాల ప్రకారం రెవెన్యూ లోటు రూ. 26,646.82 కోట్లు ఉండగా, ఈ ఆర్ధిక సంవత్సరం రూ. 18,434.14 కోట్లు రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా వేశారు. కరోనా నేపథ్యంలో రెవెన్యూ ఆదాయం తగ్గే అవకాశం స్పష్టంగా కనిపిస్తుండటంతో రెవెన్యూ లోటు భారీగా పెరిగుతుందని ఆర్ధిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

    మరోవైపు బడ్జెట్ లో రెవెన్యూ వ్యయం పెరుగుదల ఆందోళన కలిగించే స్థాయికి చేరుకుంది. అదే సమయంలో మూలధన వ్యయం తగ్గుముఖం పట్టడం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుందనేది స్పష్టం అవుతోంది. ములధన వ్యయంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అవుతుంది. ఈ ఏడాది రెవెన్యూ వ్యయం రూ. 1,80,392.64 కోట్లుగా అంచనా వేశారు. గత ఏడాది రూ. 1,80,475.94 కోట్లుగా సవరించారు. ఈ వ్యయంలో రూ.70 వేల కోట్లు ఉద్యోగుల జీతభత్యాలకు చెల్లించాల్సి ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సామాజిక భద్రతా ఫించన్లు తదితర వ్యయాలు ఉంటాయి. మరోవైపు ములధన వ్యయం ఈ ఏడాది రూ.44,396.54 అంచనా వేశారు. అయితే గత ఏడాది ములధన వ్యయం రూ. 29,907.62 కోట్లు అంచనా వేయగా కేవలం రూ. 12,845.49 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.

    రాష్ట్ర రెవెన్యూ ఆదాయం అంచనాల కంటే చాలా తక్కువగా ఉంది. గత ఏడాది రెవెన్యూ ఆదాయం రూ. 1,78,697.41 కోట్లు వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తే సవరించిన అంచనాల ప్రకారం రూ. 1,10,800.72 కోట్లు మాత్రమే ఆదాయం లభించింది. గత ఏడాది పరిస్థితులు కొంత మెరుగ్గా ఉన్నా ప్రభుత్వం ఆశించిన ఆదాయం లభించలేదు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఆ మొత్తం ఇంకా తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఈ ఏడాది రూ. 1,61,958.50 కోట్లు ఆదాయం వివిధ రూపాల్లో లభిస్తుందని అంచనా వేసింది.

    ఆదాయానికి, వ్యయానికి ఉన్న వ్యత్యాసం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పులకు వెళ్లడంతో ప్రజలపై అప్పుల భారం పెరిగిపోతుంది. రాష్ట్ర అప్పులు 2.55 లక్షల కోట్లకు చేరాయి. ఏడాదిలో ప్రభుత్వం రూ. 47 వేల కోట్ల వరకూ అప్పులు చేయడంతో ఆ మొత్తం రూ. 3.02 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి రూ. 3.55 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావం, లాక్ డౌన్ కొనసాగుతున్నందున ఈ ఏడాది ఆదాయ అవకాశాలు తగ్గిపోవడంతో జగన్ ప్రభుత్వానికి ఆర్ధికంగా ఇబ్బందులు తప్పవనే వాదనలు వినిపిస్తున్నాయి.