Homeఆంధ్రప్రదేశ్‌స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు ఓడితే మంత్రులు అవుట్!

స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు ఓడితే మంత్రులు అవుట్!

ఈ నెలలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఒక విధంగా 10 నెలల వై ఎస్ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వంపై ప్రజా తీర్పుగా మారనున్నాయి. అయితే ముఖ్యమంత్రి మాత్రం ఈ ఎన్నికలు మంత్రులు, ఎమ్యెల్యేల సమర్ధతకు పరీక్షగా పెడుతున్నారు. ఎక్కడైతే పార్టీ అభ్యర్థులు ఓటమి చెందారో అక్కడి మంత్రులు నేరుగా గవర్నర్ ను కలసి రాజీనామా సమర్పించ వలసిందే అని స్పష్టం చేశారు. అదే విధంగా సంబంధిత ఎమ్యెల్యేలకు వచ్చే ఎన్నికలలో సీట్లు ఇవ్వబోమని కూడా తేల్చి చెప్పారు.

బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశం సందర్భంగా మంత్రులతో స్థానిక సంస్థల ఎన్నికల గురించి చర్చించిన ముఖ్యమంత్రి స్థానిక సంస్థల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు,ఓటములు ఆయా జిల్లా ఇన్‌చార్జీ మంత్రులు, జిల్లామంత్రి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

ఎన్నికల్లో మంత్రుల నియోజకవర్గాల్లో ఓటమి పాలైతే ఎన్నికల ఫలితాలు రాగానే ఇందుకు బాధ్యులు తమ పదవుల నుండి తప్పుకోవాల్సిఉంటుందని, వారే గవర్నర్‌కు రాజీనామా లేఖను సమర్పించాలని సిఎం హెచ్చరించారు.

అత్యధిక సీట్లు సాధించలేకపోయిన ఎమ్మెల్యేలకు 2024 ఎన్నికల్లో సీట్లు ఇచ్చేది లేదని చెప్పినట్లు సమాచారం. ఈనెల 10న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనున్న నేపథ్యంలో ఈనెల 8 తేదీ వరకు నియోజకవర్గాల స్థాయిలో అభ్యర్థుల ఎంపిక, గెలుపు అవకాశాలు , ఆశావహులు జాబితా, తదితర అంశాలను పరిగణలోకి తీసుకునేందుకు కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

పలు జిల్లాల్లో పార్టీ నేతల మధ్య పోరు నడుస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందుతోందని, నేతల మధ్య సయోధ్య కుదర్చాల్సిన బాధ్యత ఆయా జిల్లా ఇన్‌చార్జీ మంత్రులదేనని కూడా చెప్పారు. అవసరాన్ని బట్టి జిల్లా మంత్రి తో కలిసి స్థానిక సమస్యలను పరిష్కరించి స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని సిఎం జగన్‌మోహన్‌రెడ్డి మంత్రులను ఆదేశించారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

Maruti Suzuki Brezza: మారుతి సుజుకీ Brezza.. ఇప్పుడు ఫేస్ లిప్ట్ లో.. ఎలా ఉండబోతుందంటే..

Maruti Suzuki Brezza: ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకీ కార్ల కంపెనీకి ప్రత్యేక స్థానం ఉంది. మిడిల్ క్లాస్ నుంచి ఉన్నత వర్గాల వరకు అనుకూలమైన కార్లు ఈ కంపెనీ అందిస్తుందని కొందరి...

Today Horoscope: ఈ ఐదు రాశుల వారికి అనుకూలం.. పెండింగ్ లో ఉన్న డబ్బు వసూలు..

Today Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశుల వారికి అనుకోకుండానే శుభ ఫలితాలు రానున్నాయి. మరి కొన్ని రాశుల వారు...

Today horoscope in telugu 26.7.2026 : ఈ ఐదు రాశుల వారికి అనుకూలం.. పెండింగ్ లో ఉన్న...

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశుల వారికి అనుకోకుండానే శుభ ఫలితాలు రానున్నాయి. మరి...

Gulf Tensions : గల్ఫ్‌ ఉద్రిక్తతలు తీవ్రం.. ఇరాన్‌పై చిన్న దేశాల వ్యూహాత్మక దాడులు!

Gulf Tensions : పశ్చిమాసియా మళ్లీ అగ్నిగుండంలా మారుతోంది. అమెరికా–ఇజ్రాయెల్‌తో ఇరాన్‌ మధ్య ఘర్షణలు విస్తరిస్తుండగా, గల్ఫ్‌ ప్రాంత దేశాలు నేరుగా తమ ప్రమేయం లేకపోయినా బాధిత దేశాలుగా మారాయి. అమెరికాకు స్థావరాలు...

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...
Oktelugu Epaper
Exit mobile version