https://oktelugu.com/

జగన్‌ రాజకీయ పరిణితి సాధించినట్లే..!

రాజకీయాలు అంటేనే అన్నింటా ఆరి తేరి ఉండాలి. సామ,దాన, భేదోపాయాలను ప్రదర్శించే సత్తా ఉండాలి. ఈ విషయంలో తెలంగాణ మంత్రి కేసీఆర్‌‌ ఆరితేరి ఉన్నారు. తెలంగాణకు కేంద్రం ఏ విషయంలోనూ మోకాలడ్డకుండా పనులు చక్కబెట్టుకుంటూ పోతున్నారు. అప్పుడప్పుడూ కేంద్రాన్ని బెదిరిస్తుంటారు. అదే సమయంలో అవసరమైనప్పుడు మైత్రిని ప్రదర్శిస్తున్నారు. Also Read: కొత్త సీఎస్ ఎవరు? సీనియర్లు వీరే.. కేబినెట్ లో చర్చ కానీ.. ఆంధ్రప్రదేశ్ విషయంలో సీన్ రివర్స్ అవుతోంది. అధికార, ప్రతిపక్షాల నాయకత్వ బలహీనతలు కేంద్రానికి […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 19, 2020 / 09:36 AM IST
    Follow us on


    రాజకీయాలు అంటేనే అన్నింటా ఆరి తేరి ఉండాలి. సామ,దాన, భేదోపాయాలను ప్రదర్శించే సత్తా ఉండాలి. ఈ విషయంలో తెలంగాణ మంత్రి కేసీఆర్‌‌ ఆరితేరి ఉన్నారు. తెలంగాణకు కేంద్రం ఏ విషయంలోనూ మోకాలడ్డకుండా పనులు చక్కబెట్టుకుంటూ పోతున్నారు. అప్పుడప్పుడూ కేంద్రాన్ని బెదిరిస్తుంటారు. అదే సమయంలో అవసరమైనప్పుడు మైత్రిని ప్రదర్శిస్తున్నారు.

    Also Read: కొత్త సీఎస్ ఎవరు? సీనియర్లు వీరే.. కేబినెట్ లో చర్చ

    కానీ.. ఆంధ్రప్రదేశ్ విషయంలో సీన్ రివర్స్ అవుతోంది. అధికార, ప్రతిపక్షాల నాయకత్వ బలహీనతలు కేంద్రానికి అలుసుగా మారాయి. కేంద్రాన్ని నిలదీసి రావాల్సిన హక్కులు, రాష్ట్రానికి వనరులు రాబట్టుకోలేక చతికిలపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని వేలెత్తి చూపే సాహసం చేయలేకపోతున్నారు. పొరుగున ఉన్న కేసీఆర్ కీలకమైన అంశాల్లో కేంద్రంతో విభేదిస్తూ తన పలుకుబడి పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

    ఏపీ నేతలు మాత్రం కేంద్రం చెప్పిన ప్రతి విషయానికి తల ఊపుతూ సామంతులుగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో అధికార, ప్రతిపక్ష నాయకులైన జగన్, చంద్రబాబు పోటీ పడుతున్నారు. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర నాయకత్వం ముందు సాగిలపడుతున్నారు. రాజకీయ ఎత్తుగడలో భాగంగా చంద్రబాబు బీజేపీతో తగవు పెట్టుకుని పార్టీని తీవ్రంగా దెబ్బతీసుకున్నారు. ఎన్నికల వంటి కీలక ఘట్టంలో కేంద్ర సంస్థల దాడులతో ఎన్నికలకు వనరులు సమకూర్చాల్సిన పెద్దలు చేతులెత్తేశారు. ఆ తర్వాత వారంతా బీజేపీలో కలిసి పోయారు.

    వైసీపీకి కేంద్రం ప్రత్యక్షంగా సహకరించింది ఏమీ లేదు. కానీ చంద్రబాబును మాత్రం నియంత్రించింది. అది పరోక్షంగా వైసీపీకి వరంగా మారింది. హైదరాబాద్ నుంచి అమరావతికి రాజధాని మార్చుకోక తప్పని అనివార్యం కూడా చంద్రబాబు స్వయంకృతాపరాధమే. టీడీపీ పతనానికి అప్పుడే నాందిప్రస్తావన జరిగింది. తన పాలన కాలంలో రాష్ట్రాన్ని చక్కదిద్దుకోవడంపైనే చంద్రబాబు దృష్టి పెట్టి ఉంటే సరిపోయేది. కానీ.. ప్రధాన ప్రత్యర్థి అయిన జగన్ మోహన్ రెడ్డిపై కేసుల దర్యాప్తును వేగవంతం చేయమని చంద్రబాబు డిమాండ్ చేసేవారని బీజేపీ వర్గాల ప్రధాన అభియోగం. అయితే కేంద్రం మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుందనే ఉదాసీన వైఖరి తీసుకోవడంతో వైసీపీకి లాభించింది.

    Also Read: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్… 2,000 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్..?

    జగన్ కు ఉన్న ప్రజాబలాన్ని అంచనా వేసే మోడీ, షా ద్వయం వ్యూహాత్మక జాప్యం చేసింది. కేంద్రం తన మాట వినడం లేదని కినిసిన చంద్రబాబు అవిశ్వాసంతో బీజేపీకి దూరమయ్యారు. ఫలితాన్ని చవిచూశారు. మోడీ, షాల రాజకీయ పటిమ కు దిమ్మతిరిగిన చంద్రబాబు తర్వాత కేంద్రం ఊసెత్తడం లేదు. విద్యుత్తు సంస్కరణలు, రైతు చట్టాలు, పౌరసత్వ సవరణల వంటివి ప్రాంతీయ పార్టీలకు రాజకీయంగా మైలేజీ ఇచ్చే అంశాలు. అయినప్పటికీ కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడే సాహసం చేయలేకపోతున్నారు. దీంతో జాతీయస్థాయి కలిగిన నేత చంద్రబాబు తనను తాను నిర్వీర్యం చేసేసుకుంటున్నారు. కనీసం రాష్ట్రానికి చట్టప్రకారం రావాల్సిన హక్కుల విషయంలోనూ కేంద్రాన్ని నిలదీయడం లేదు. తనకు రాజకీయంగా చేటు చేస్తారనే భయంతో కేంద్ర పెద్దల వైపు వేలెత్తి చూపడం లేదు. మొత్తంగా చూస్తే రాజకీయాల్లో తనది దశాబ్దాల చరిత్ర అని చెప్పుకునే చంద్రబాబు రాజకీయాల ముందు.. జగన్‌ చేస్తున్న రాజకీయాలు చాలా అడ్వాన్స్‌గా ఉన్నట్లే కనిపిస్తున్నాయి. అందుకే.. కేంద్రంతో ఎలాంటి గెలికి ఖయ్యం పెట్టుకోకుండా మిత్రుత్వంతో నడుచుకుంటున్నారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్