దేశంలో రోజురోజుకు ముఖంపై మచ్చల వల్ల ఇబ్బంది పడే వారి సంఖ్య పెరుగుతోంది. పెరుగుతున్న కాలుష్యం, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం ముఖంపై మచ్చలకు కారణమవుతున్నాయి. చాలామంది నల్లమచ్చలకు చెక్ పెట్టేందుకు క్రీమ్ లను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే చాలా సందర్భాల్లో ఎన్ని క్రీములు వాడినా సమస్యకు చెక్ పెట్టడం సాధ్యం కాదు. అయితే కెమికల్స్ తో తయారైన క్రీముల కంటే ఇంటి చిట్కాల ద్వారా సులభంగా నల్ల మచ్చల సమస్యకు చెక్ పెట్టవచ్చు.
Also Read: తుమ్ములు త్వరగా తగ్గడానికి పాటించాల్సిన చిట్కాలివే..?
అయితే ఎలాంటి ఇన్ఫెక్షన్లు లేకపోతే మాత్రమే మచ్చలను తొలగించుకోవడానికి ఇంటి చిట్కాలను పాటించాలి. లేకపోతే ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చర్మంపై నల్లమచ్చలను తొలగించడానికి నిమ్మరసం అద్భుతంగా పని చేస్తుంది. నిమ్మకాయను చర్మంపై రబ్ చేసి చల్ల నీటితో శుభ్రం చేసుకుంటే నల్లమచ్చలకు సులభంగా చెక్ పెట్టవచ్చు. పాలలో ఓట్స్ వేసి మెత్తని ముద్దగా చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకున్నా నల్లమచ్చల సమస్యకు చెక్క్ పెట్టవచ్చు.
Also Read: బాదం పాలు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?
నల్ల మచ్చలు ఉన్న చోట ఆరెంజ్ తో మర్ధన చేసినా మంచి ఫలితాలు ఉంటాయి. పుదీనా ఆకులను మెత్తగా చేసి అందులో నిమ్మ రసం, ఆలివ్ ఆయిల్ కలిపి ముఖానికి మర్ధనా చేసినా మంచి ఫలితం ఉంటుంది. దాల్చిన చెక్క పొడిలో కొంచెం తేనె కలిపి మచ్చలు ఉన్న చోట రాసి తరువాత రోజు ముఖం శుభ్రం చేసుకున్నా నల్ల మచ్చలకు చెక్ పెట్టవచ్చు. పాలలో నిమ్మరసం కలిపి పడుకునే ముందు ముఖం తుడుచుకున్నా మంచి ఫలితాలు ఉంటాయి.
మరిన్ని వార్తల కోసం: ఆరోగ్యం/జీవనం
నల్లమచ్చలపై తేనె రాయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఎర్రచందనం పొడిలో రోజ్ వాటర్ కలిపి ముఖానికి పూసుకుని చల్ల నీళ్లతో కడిగినా నల్ల మచ్చల సమస్య నుంచి బయటపడవచ్చు.