మోడీ బ్రహ్మాస్త్రాన్ని తీయబోతున్నాడా?

ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. ప్రధాని నరేంద్రమోడీ ఏదో ఒక జిమ్మిక్కు చేసి గెలిచేస్తున్నాడు. 2014లో ‘ఒక టీ అమ్మేవాడు ప్రధాని కాకూడదా’ అని తన మూలాలను బయటకు తీసి పేదలు, మధ్యతరగతి వారిని ఆకట్టుకొని దేశ ప్రధాని అయ్యాడు. ఇక 2019లో పాకిస్తాన్ తో యుద్ధం, హిందుత్వను రాజేసి అఖండ మెజార్టీ సాధించి రెండోసారి ప్రధాని అయ్యాడు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టడానికి మోడీ ‘బ్రహ్మాస్త్రాన్ని’ రెడీ చేస్తున్నాడని బీజేపీ వర్గాల్లో చర్చ మొదలైంది.. 2024 […]

Written By: NARESH, Updated On : June 13, 2020 6:56 pm
Follow us on


ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. ప్రధాని నరేంద్రమోడీ ఏదో ఒక జిమ్మిక్కు చేసి గెలిచేస్తున్నాడు. 2014లో ‘ఒక టీ అమ్మేవాడు ప్రధాని కాకూడదా’ అని తన మూలాలను బయటకు తీసి పేదలు, మధ్యతరగతి వారిని ఆకట్టుకొని దేశ ప్రధాని అయ్యాడు. ఇక 2019లో పాకిస్తాన్ తో యుద్ధం, హిందుత్వను రాజేసి అఖండ మెజార్టీ సాధించి రెండోసారి ప్రధాని అయ్యాడు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టడానికి మోడీ ‘బ్రహ్మాస్త్రాన్ని’ రెడీ చేస్తున్నాడని బీజేపీ వర్గాల్లో చర్చ మొదలైంది..

2024 ఎన్నికలకు మోడీ నిజంగానే పెద్ద ప్లాన్ చేస్తున్నారని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఇదే మద్యం నిషేధం అట.. కేంద్రప్రభుత్వ పరిధిలోకి మద్యం తీసుకురావాలని.. దేశవ్యాప్తంగా నిషేధాన్ని ప్రకటించాలని మోడీ యోచిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. దీనినే మోడీ ఎన్నికల అజెండాగా మార్చి ప్రతిపక్షాలను తుడిచిపెట్టేయాలని మాస్టర్ ప్లాన్ వేసినట్టు సమాచారం.

గుజరాత్ లో సీఎం-హోంమంత్రులుగా ఉన్న ఇదే మోడీ-అమిత్ షాలు మద్యనిషేధాన్ని సమర్థంగా అమలు చేశారు. ఇప్పుడు దేశ ప్రధానిగా మోడీ-హోంమంత్రి షా లు ఇద్దరూ కలిసి దేశవ్యాప్తంగా మద్యనిషేధాన్ని తీసుకురావాలని తీవ్రంగా ఆలోచిస్తున్నారని ఉన్నతస్థాయి వర్గాలు చెబుతున్నాయి.గుజరాత్, బీహార్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే నిషేధం అమలులో ఉంది. నిషేధం కారణంగా మద్యం నుంచి ఎటువంటి ఆదాయం రాకపోయినప్పటికీ రెండు రాష్ట్రాలు తమ అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగించగలిగాయి. మోడీ ఇప్పుడు దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయాలని భావిస్తున్నారట..

ఇప్పటికే ఏపీలో సీఎం జగన్ కూడా మద్యనిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తున్నారు. దీంతో ఏపీ నుంచి కూడా మోడీ నిర్ణయానికి మద్దతు లభిస్తుంది.

ఈ ప్లాన్ వేయడానికి ప్రధాన కారణం.. నిషేధం ఎన్నికల అజెండాగా మారితే.. చాలా రాష్ట్రాల్లో దాదాపు సగం జనాభా ఉన్న మహిళా ఓటర్ల నుంచి మోడీకి భారీ మద్దతు లభిస్తుంది. మద్యపాన వ్యతిరేక ఆందోళనలో ముందంజలో ఉన్నది మహిళలే కావడంతో వారి ఓట్లన్నీ గంపగుత్తగా పడుతాయని మోడీ ఈ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే దీనిపై మోడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి బృందం దేశవ్యాప్తంగా నిషేధంపై పర్యవసనాలను ఆరాతీస్తోంది. రాష్ట్రాలు భారీగా ఆదాయాన్ని కోల్పోతే ఎలా అన్నది ఇప్పుడు మోడీ ముందున్న ప్రశ్న. పెట్రోల్, మద్యం ద్వారానే ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఇవే రెండు ప్రధాన ఆదాయ వనరులు. మద్యం నిషేధం వల్ల కలిగేనష్టాలకు రాష్ట్రాలకు పరిహారం చెల్లించే ప్రణాళికలపై మోడీ దృష్టిసారించినట్టు తెలుస్తోంది. సో వచ్చే సంవత్సరాల్లోనే దేశం మద్య నిషేధం దిశగా అడుగులు వేస్తుందన్నమాట..

-నరేశ్ ఎన్నం