https://oktelugu.com/

జగన్ దేవుడు…మోడీ అంటే ఇష్టం..!

కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ప్రభుత్వ వైద్యుడు సుధాకర్ ఆజ్ఞతాన్ని వీడారు. విశాఖలోని 4వ టౌన్ పోలీసు స్టేషన్ కు గురువారం వచ్చిన ఆయన సస్పెన్షన్ అనంతరం జరిగిన పరిణామాలను మీడియాకు వివరించారు. మాస్క్ ల కొరతపై మాట్లాడేందుకు తాను మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఇంటికి వెళ్లాడమే పెద్ద తప్పుగా పేర్కొన్నారు. సస్పెన్షన్ అనంతరం తనకు చాలా ఎక్కువ సంఖ్యలో బెదిరింపు కాల్స్ వచ్చాయాని చెప్పారు. ఈ కాల్స్ బెడద వల్ల తీవ్ర ఆందోళనకు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 11, 2020 / 04:50 PM IST
    Follow us on


    కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ప్రభుత్వ వైద్యుడు సుధాకర్ ఆజ్ఞతాన్ని వీడారు. విశాఖలోని 4వ టౌన్ పోలీసు స్టేషన్ కు గురువారం వచ్చిన ఆయన సస్పెన్షన్ అనంతరం జరిగిన పరిణామాలను మీడియాకు వివరించారు. మాస్క్ ల కొరతపై మాట్లాడేందుకు తాను మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఇంటికి వెళ్లాడమే పెద్ద తప్పుగా పేర్కొన్నారు. సస్పెన్షన్ అనంతరం తనకు చాలా ఎక్కువ సంఖ్యలో బెదిరింపు కాల్స్ వచ్చాయాని చెప్పారు. ఈ కాల్స్ బెడద వల్ల తీవ్ర ఆందోళనకు గురైనట్లు చెప్పారు.

    కొంత కాలం తరువాత నక్కపల్లిలోని బ్యాంక్ కు వెళుతుండగా తన కారును కొందరు వెంబడిస్తున్నట్లు గుర్తించానని, తాను కారు అపినప్పుడు వెంబడిస్తున్న వారు వచ్చి తనతో గొడవకు దిగారని తెలిపారు. అప్పటికే కారులో రూ. 10 లక్షల డబ్బు ఉందన్నారు. ఆ మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయడానికి తీసుకువెళుతున్నట్లు చెప్పారు. తనతో గొడవ పడినా వ్యక్తులు కారులో మద్యం సీసాలు ఉంచినట్లు తెలిపారు. డబ్బు దొంగిలించారన్నారు. అనంతరం పోలీసులకు పోన్ చేసి సమాచారం ఇచ్చి తనపై అవాస్తవాలు చెప్పారని అన్నారు. తనను వెంబడించింది గుండాలేనని, వారు ముఖానికి రుమాలు అడ్డుకట్టుకుని ఉండటంతో వారిని గుర్తు పట్టలేక పోయానని తెలిపారు.

    తనకు ఏ పార్టీతో సంబంధం లేదని, చంద్రబాబు హయాంలో డాక్టర్ గా పనిచేశానని చెప్పారు. ఒక పార్టీకి చెందిన వాడిగా ముద్ర వేశారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్, ప్రధాని మోడీ వంటి వారిని తాను ఎలా తిడతానని ప్రశ్నించారు. సీఎం జగన్ దేవుడని, ప్రధాని మోడీ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. తనకు కావాలనే గుండు గీశారని అయితే ఎవరనే విషయాన్ని బయట పెట్టానన్నారు. సస్పెన్షన్ వల్ల జీతం లేక ఇబ్బంది పడుతున్నానని చెప్పారు. తన తప్పు ఉంటే క్షమించి తనపై సస్పెన్షన్ ఎత్తేసి ఉద్యోగం చేసుకునే అవకాశం ఇస్తే చాలన్నారు. తనను ఉద్యోగం నుంచి తొలగించాలనే కుట్రతో ఈ చర్యలకు పాల్పడ్డారని తెలిపారు.