https://oktelugu.com/

ఏపీ ఫైబర్ గ్రిడ్ పై విచారణకు కేబినెట్ నిర్ణయం..!

గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఏపీ ఫైబర్‌ నెట్, చంద్రన్న కానుక, రంజాన్‌ తోఫా పథకాల్లో జరిగిన అక్రమాలపై కేబినెట్ సబ్‌ కమిటీ ఇచ్చిన రెండవ నివేదికకు మంత్రి వర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ప్రాథమిక ఆధారాలు ఉన్నందున లోతుగా దర్యాప్తు చేసి బాధ్యులు ఎవరో తేల్చాలని నిర్ణయం తీసుకున్నారు. తదుపరి దర్యాప్తు సంస్థలతో దర్యాప్తునకు ఆదేశాలు ఇవ్వాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ హాలులో గురువారం జరిగింది. […]

Written By: , Updated On : June 11, 2020 / 05:42 PM IST
Follow us on


గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఏపీ ఫైబర్‌ నెట్, చంద్రన్న కానుక, రంజాన్‌ తోఫా పథకాల్లో జరిగిన అక్రమాలపై కేబినెట్ సబ్‌ కమిటీ ఇచ్చిన రెండవ నివేదికకు మంత్రి వర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ప్రాథమిక ఆధారాలు ఉన్నందున లోతుగా దర్యాప్తు చేసి బాధ్యులు ఎవరో తేల్చాలని నిర్ణయం తీసుకున్నారు. తదుపరి దర్యాప్తు సంస్థలతో దర్యాప్తునకు ఆదేశాలు ఇవ్వాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ హాలులో గురువారం జరిగింది. మంత్రి వర్గ సమావేశం వివరాలను సమాచార శాఖ మంత్రి పేర్ని నాని వివరించారు. ఈ నెల 16వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ చేయూత పథకం అమలుకు అంగీకరించింది.

నాలుగేళ్లకు రూ. 18 నుండి 20 వేల కోట్ల చేయూత కు కర్చు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది. జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలు అందజేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్టోబర్ లో ఈ పథకం ప్రారంభించనుమన్నారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలకు ఆమోదం లభించింది.

రూ. 1863 కోట్లు ఖర్చు చేసేందుకు అనుమతించింది. ప్రభుత్వ ఇళ్ళ స్థలాలు, ఇల్లు అమ్ముకునేందుకు 5 ఏళ్ల తర్వాత హక్కు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. గ్రే హౌండ్స్ కు విశాఖలో భూమిని ఉచితంగా ఇచ్చేందుకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. జే.ఎన్.టి.యూ కాకినాడ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కురుపాంలో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు అంగీకారాన్ని తెలియజేసింది.

తెలుగు, సంస్కృత అకాడమీలు తిరుపతి లో ఏర్పాటుకు ఆమోద ముద్ర వేసింది. జగనన్న విద్య దీవెన పథకంలో తల్లుల అకౌంట్ నాలుగు విడుతలగా డబ్బులు వేసేందుకు అనుమతి ఇచ్చింది. సోలార్ పవర్ యూనిట్ స్థాపనకు పరిపాలన పరమైన అనుమతి ఇచ్చింది.

రామాయపట్నం పోర్ట్ నిర్మాణంకు ఆమోద ముద్ర వేసింది. గండికోట రిజర్వాయర్ లో పూర్తి సామర్ధ్యం కోసం అర్ అండ్ అర్, మరియు వెలిగొండ అర్ అండ్ అర్ పనులకు ఆమోదం తెలిపింది. పన్నులు ఎగవేతను అరికట్టడం కోసం ఏపీ స్టేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఏర్పాటుకు, ఇందుకు అవసరమైన 55 పోస్ట్ లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.