గ్యాస్ లీక్ తో రాజధాని తరలింపు సాధ్యమా!

విశాఖపట్నంకు రాజధానిని తరలించడానికి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలను గురువారం జరిగిన గ్యాస్ లీక్ మరోసారి ప్రశ్నార్ధకరం కావించే పరిస్థితులు నెలకొంటున్నాయి. జగన్ మోహన్ రెడ్డి రాజధాని తరలింపు ప్రయత్నం మొదలు పెట్టినప్పటి నుండి ఏదో ఒక అడ్డంకి ఏర్పడుతూనే ఉన్నది. అందుకోసం ముఖ్యమంత్రి పెట్టుకున్న గడువులన్ని వాయిదా పడుతూ వస్తున్నాయి. కమీషన్ల కోసమే జగన్‌తో కేసీఆర్ దోస్తీ రాష్ట్ర శాసనసభలో మాట్లాడుతూ నవంబర్ చివరిలో నాటకీయంగా మూడు రాజధానుల ప్రతిపాదనను […]

Written By: Neelambaram, Updated On : May 8, 2020 12:50 pm
Follow us on


విశాఖపట్నంకు రాజధానిని తరలించడానికి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలను గురువారం జరిగిన గ్యాస్ లీక్ మరోసారి ప్రశ్నార్ధకరం కావించే పరిస్థితులు నెలకొంటున్నాయి. జగన్ మోహన్ రెడ్డి రాజధాని తరలింపు ప్రయత్నం మొదలు పెట్టినప్పటి నుండి ఏదో ఒక అడ్డంకి ఏర్పడుతూనే ఉన్నది. అందుకోసం ముఖ్యమంత్రి పెట్టుకున్న గడువులన్ని వాయిదా పడుతూ వస్తున్నాయి.

కమీషన్ల కోసమే జగన్‌తో కేసీఆర్ దోస్తీ

రాష్ట్ర శాసనసభలో మాట్లాడుతూ నవంబర్ చివరిలో నాటకీయంగా మూడు రాజధానుల ప్రతిపాదనను జగన్ చేశారు. ఆ తర్వాత వెంటనే నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వడం, దానిని శాసన సభలో ఆమోదింప చేయడం అంతా త్వరితగతిన జరిగి పోయాయి. అయితే శాసన మండలి అడ్డు పడడంతో దానిని రద్దు చేసే పక్రియను చేపట్టారు.

మధ్యలో అడ్డంకులు ఏర్పడడంతో గడువును మొదట సంక్రాంతికి, తర్వాత రిపబ్లిక్ డే నాటికి పొడిగించారు. చట్టబద్ధంగా మార్చే వీలు లేకపోవడంతో అనధికారికంగా మార్చడం కోసం రంగం సిద్ధం చేశారు. ఈ సమయంలో హై కోర్ట్ లో అడ్డంకులు ఏర్పడ్డాయి.

మొదటగా ఎసిబి కార్యాలయంతో పాటు లోకాయుక్త వంటి కార్యాలయాలను కర్నూల్ మార్చడం చేపట్టారు. హైకోర్ట్ అడ్డుపడడంతో సాధ్యం కాలేదు. ఇంతలో కరోనా మహమ్మారితో లాక్ డౌన్ రూపంలో అడ్డంకులు ఎదురయ్యాయి.

ఘోరం.. రైలు చక్రాలక్రింద నలిగిన కూలి బ్రతుకులు!

లాక్ డౌన్ సమయంలో కూడా విశాఖకు మార్చే ప్రయత్నాలను ఆపలేదు. అంతలో హైకోర్ట్ నుండి తీవ్రమైన మొట్టికాయలు ఎదురైనా అడ్డదారిలో మార్చే పధకాలు మొదలు పెట్టారు. విశాఖకు రాజధాని తరలింపును వ్యతిరేకిస్తున్న వారు మొదటినుండి చేస్తున్న వాదనలో ప్రముఖమైనది అది సురక్షిత నగరం కాదని.

పకృతి వైపరీత్యాలతో పాటు పారిశ్రామిక ప్రమాదాలు కూడా ఎక్కువగా ఉండవచ్చనే భయాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జరిగిన గ్యాస్ లీక్ అటువంటి భయాలకు బలం చేకూర్చిన్నట్లు అయింది. అధికార యంత్రాంగంలో సహితం రాజధాని మార్పు పట్ల ఇప్పుడు విముఖత వ్యక్తం కావడానికి దారితీసే అవకాశం ఉంది.

రాజధాని మార్పు ఆలోచనను పునరాలోచించుకోవాలని ఇప్పుడు ముఖ్యమంత్రిపై కూడా వత్తిడి కలిగించే అవకాశం ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు. పారిశ్రామిక నగరంగా ఉన్న విశాఖకు రాజధాని తరలించడంతో తలెత్తే ప్రమాదాల గురించి ఇప్పుడు పలు నూతన వర్గాల నుండి హెచ్చరికలు వెలువడుతున్నాయి.