https://oktelugu.com/

కమీషన్ల కోసమే జగన్‌తో కేసీఆర్ దోస్తీ

ఉద్యమ సమయంలో ఏ కాంట్రాక్టర్లకు వ్యతిరేకంగా కేసీఆర్‌ మాట్లాడారో ఇప్పుడు కమీషన్లకోసం వారితోనే కుమ్మక్క య్యారని, కమీషన్ల కోసమే జగన్‌తో దోస్తీ చేస్తున్నారని మాజీ ఎంపీ, బిజెపి నేత జి వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. అటు కృష్ణా నీటిని దోచుకునేందుకు ఏపీ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోకుండా తెలంగాణకు కేసీఆర్‌ అన్యాయం చేసేలా వ్య వహరిస్తున్నారని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ కెపాసిటీని డబుల్‌ చేస్తూ ఏపీ తీసుకున్న నిర్ణయం పై సీఎం కేసీఆర్‌ నోరు విప్పాలని డిమాండ్ […]

Written By: , Updated On : May 8, 2020 / 10:53 AM IST
Follow us on


ఉద్యమ సమయంలో ఏ కాంట్రాక్టర్లకు వ్యతిరేకంగా కేసీఆర్‌ మాట్లాడారో ఇప్పుడు కమీషన్లకోసం వారితోనే కుమ్మక్క య్యారని, కమీషన్ల కోసమే జగన్‌తో దోస్తీ చేస్తున్నారని మాజీ ఎంపీ, బిజెపి నేత జి వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. అటు కృష్ణా నీటిని దోచుకునేందుకు ఏపీ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోకుండా తెలంగాణకు కేసీఆర్‌ అన్యాయం చేసేలా వ్య వహరిస్తున్నారని మండిపడ్డారు.

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ కెపాసిటీని డబుల్‌ చేస్తూ ఏపీ తీసుకున్న నిర్ణయం పై సీఎం కేసీఆర్‌ నోరు విప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రజలకు కేసీఆర్‌ స్పష్టత ఇవ్వాలని కోరారు. పోతిరెడ్డిపాడు విస్తరణకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రే పోరాటాన్ని నడిపించాలని కోరుతూ ఏపీ కాంట్రాక్టర్ల కోసమేనా.. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు అడిషనల్‌ టీఎంసీ పనులకు టెండర్లు పిలిచారని వివేక్ ఆరోపించారు.

ఘోరం.. రైలు చక్రాలక్రింద నలిగిన కూలి బ్రతుకులు!

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును, మహబూబ్‌నగర్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాలను ఎండబెట్టేలా జగన్‌ పోతిరెడ్డిపాడు కె పాసిటీని పెంచుతున్నారని, ఉద్యమ సమయంలో దీనిపై తీవ్ర స్వరంతో విరుచుకుపడిన కేసీఆర్‌ ఇప్పుడు ఎందుకు కిమ్మనడం లేదని ప్రశ్నించారు.

ఇటు తెలంగాణ, అటు ఆంధ్రాలో పనులు చేసేది మేఘా కృష్ణారెడ్డి అని గుర్తు చేస్తూ, వాళ్లతో కేసీఆర్‌ లాలూచీ పడి పోతిరెడ్డిపాడుపై మాట్లాడటం లేదని ధ్వజమెత్తా రు. అప్పుడు కర్నూలు జిల్లాలో పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ వద్దకు వెళ్లి లొల్లిచేసిన హరీష్ రావు ఇప్పుడు అటువైపు ఎందుకు చూడటం లేదని ఎద్దేవా చేశారు.

గ్యాస్ లీకేజ్ నివారణకు ప్రత్యేక బృందం..!

పోతిరెడ్డి పాడు విస్తరణపై ఏపీ ప్రభుత్వ చర్యలను కేసీఆర్‌ వ్యతిరేకించాలని డిమాండ్‌ చేశారు. వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు కెపాసిటీని పెంచితే అందరం కలిసి కొట్లాడిన విషయాన్ని వివేక్‌ గుర్తు చేశారు.

వైఎస్ హయాంలోనే శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ ను సీమకు తరలించే పోతిరెడ్డి పాడు కుట్ర మొదలైందని వివేక్ పేర్కొన్నారు. అప్పుడు రోజుకు 11 వేల క్యూ సెక్కుల కృష్ణా నీటిని దోచుకుంటే, ఇప్పుడు అంతకు ఏడింతలు 80 వేల క్యూసెక్కుల దోపిడీకి ప్రాజెక్టులు కట్టుకుంటుంటే సీఎం పేక్షక పాత్ర పోషిస్తున్నారని దుయ్యబట్టారు.

పోతిరెడ్డిపాడుతో మన ప్రాజెక్టులన్నీ ఎండిపోతాయని, రోజుకు 8 టీఎంసీలు లిఫ్టింగ్ చేస్తే తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని వివేక్ హెచ్చరించారు. పాలమూరు రంగా రెడ్డి, కల్వ కుర్తి ప్రాజెక్టులకు చుక్క నీరు రాకుండా పోతుందని, మహబూబ్ నగర్ లా బీడు వారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.