సక్సస్ సిక్రెట్ రిలీవ్ చేసిన రష్మీ

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే జబర్దస్త్ యాంకర్ రష్మీ తాజాగా తన సక్సస్ సిక్రెట్ అభిమానులతో పంచుకుంది. సినీరంగంలో ఉన్న పోటీని ఎదుర్కొవాలో అనే అంశంపై రష్మి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆన్ లైన్ ఛాటింగ్ లో ఆమెను ఓ అభిమాని ‘సినీరంగంలో పోటీ అధికంగా ఉంటుంది? కదా దీనిని ఎలా ఎదుర్కొన్నారు? అని ప్రశ్నించాడు. దీనికి ఆమె చెప్పిన సమాధానం అందరినీ ఆకట్టుకుంది. దీనిపై ఆమె స్పందిస్తూ పోటీ అనేది అన్ని రంగాల్లో […]

Written By: Neelambaram, Updated On : May 8, 2020 3:06 pm
Follow us on


సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే జబర్దస్త్ యాంకర్ రష్మీ తాజాగా తన సక్సస్ సిక్రెట్ అభిమానులతో పంచుకుంది. సినీరంగంలో ఉన్న పోటీని ఎదుర్కొవాలో అనే అంశంపై రష్మి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆన్ లైన్ ఛాటింగ్ లో ఆమెను ఓ అభిమాని ‘సినీరంగంలో పోటీ అధికంగా ఉంటుంది? కదా దీనిని ఎలా ఎదుర్కొన్నారు? అని ప్రశ్నించాడు. దీనికి ఆమె చెప్పిన సమాధానం అందరినీ ఆకట్టుకుంది. దీనిపై ఆమె స్పందిస్తూ పోటీ అనేది అన్ని రంగాల్లో ఉంటుందని తెలిపారు. పోటీ ఉంటేనే ఎవరేంటో తెలుస్తుందని తెలిపింది. కెరీర్లోనూ, జీవితంలో ముందుకెళ్లడానికి పోటీ అవసరమని స్పష్టం చేసింది.

కమీషన్ల కోసమే జగన్‌తో కేసీఆర్ దోస్తీ

అంతేకాకుండా బుల్లితెరపై తాను, అనసూయ ఓ కొత్త ట్రెండ్ సృష్టించామని చెప్పింది. ఇది తమకెంతో గర్వకారణమని అంటోంది. యాంకర్ల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటుందని తెలిపింది. తాను, అనసూయ ఎల్లప్పుడు యాంకర్ సుమతో పోటీపడుతుంటామని చెప్పింది. అయితే బుల్లితెరకు గ్లామర్ ను పరిచయం చేసింది నేను, అనసూయనే. మా ఇద్దరి సక్సస్ కు గ్లామరే కారణమని కుండబద్దలు కొట్టింది. తమలా చేయగలిగితే ఎవరైనా ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలుగుతారని రష్మీ చెప్పింది. ప్రస్తుతం రష్మీ బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా రాణిస్తుంది. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో మూగజీవాలకు సాయం చేస్తుండటంపై నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు.