https://oktelugu.com/

October Bank Holidays: 21 రోజులు బ్యాంకులు బంద్‌.. అక్టోబర్‌ నెల సెలవులు ఇవే..!

October Bank Holidays: అక్టోబర్‌ నెలలో పండుగలు సమీపిస్తున్నందున, ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకులు రెండవ, నాల్గవ శని, ఆదివారాలతోసహా 21 రోజుల పాటు బ్యాంకులు మూసివేయబడతాయి. ఈమేరకు బ్యాంకులకు సెలవుల జాబితాను ఆర్‌బీఐ విడుదల చేసింది. మార్గదర్శకాల ప్రకారం, రాష్ట్రాన్ని బట్టి కొన్ని ప్రాంతీయ సెలవులతో అన్ని ప్రభుత్వ సెలవు దినాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి. ప్రాంతీయ రాష్ట్ర సెలవులను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. అందువల్ల, కస్టమర్లు తమ సమీప బ్యాంకును సందర్శించే ముందు సెలవుల […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 1, 2022 / 12:43 PM IST
    Follow us on

    October Bank Holidays: అక్టోబర్‌ నెలలో పండుగలు సమీపిస్తున్నందున, ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకులు రెండవ, నాల్గవ శని, ఆదివారాలతోసహా 21 రోజుల పాటు బ్యాంకులు మూసివేయబడతాయి. ఈమేరకు బ్యాంకులకు సెలవుల జాబితాను ఆర్‌బీఐ విడుదల చేసింది. మార్గదర్శకాల ప్రకారం, రాష్ట్రాన్ని బట్టి కొన్ని ప్రాంతీయ సెలవులతో అన్ని ప్రభుత్వ సెలవు దినాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి. ప్రాంతీయ రాష్ట్ర సెలవులను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. అందువల్ల, కస్టమర్లు తమ సమీప బ్యాంకును సందర్శించే ముందు సెలవుల జాబితాను తనిఖీ చేయండి.

    October Bank Holidays

    అందుబాటులో ఆన్‌లైన్‌ సేవలు..

    21 రోజులపాటు బ్యాంకులు మూసివేయబడినప్పటికీ ఆన్‌లైన్‌ ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి. కాబట్టి వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్బీఐ ప్రకటించింది. కస్టమర్‌లు బ్యాంక్‌ నుంచి డబ్బును నేరుగా డిపాజిట్‌ లేదా వితడ్రా చేయలేరు. అయితే వారు ఎలాంటి సమస్యలు లేకుండా ఇంటర్నెట్‌ సేవలను ఉపయోగించవచ్చు.

    అక్టోబర్‌ 2022 నెలలో బ్యాంక్‌ సెలవులు ఇవే..

    – అక్టోబరు 1, 2022– బ్యాంకు ఖాతాల అర్ధ వార్షిక ముగింపు (గ్యాంగ్‌టక్‌)
    – అక్టోబర్‌ 2, 2022– గాంధీ జయంతి, ఆదివారం
    – అక్టోబర్‌ 3, 2022– దుర్గాపూజ (అగర్తలా, భువనేశ్వర్, గౌహతి, ఇంఫాల్, కోల్‌కతా, పాట్నా మరియు రాంచీ)
    – అక్టోబర్‌ 4, 2022– దుర్గాపూజ/దసరా/ఆయుధ పూజ/శ్రీమంత శంకరదేవ (అగర్తల, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గాంగ్‌టక్, గౌహతి, కాన్పూర్, కొచ్చి, కోల్‌కతా, లక్నో, పాట్నా, రాంచీ, షిల్లాంగ్, తిరువనంతపురం)
    – అక్టోబర్‌ 5, 2022– దుర్గాపూజ/దసరా/శ్రీమంత శంకరదేవుని జన్మోత్సవం
    – అక్టోబర్‌ 6, 2022– దుర్గాపూజ(గ్యాంగ్‌టక్‌)
    – అక్టోబర్‌ 7, 2022– దుర్గా పూజ(గ్యాంగ్‌టక్‌)
    – అక్టోబర్‌ 8, 2022– రెండవ శనివారం సెలవు మరియు మిలాద్‌–ఇ–షెరీఫ్‌/ఈద్‌–ఇ–మిలాద్‌–ఉల్‌–నబీ (భోపాల్, జమ్ము, కొచ్చి, శ్రీనగర్, తిరువనంతపురం)
    – అక్టోబర్‌ 9, 2022– ఆదివారం
    – అక్టోబర్‌ 13, 2022– కర్వా చౌత్‌ (సిమ్లా)
    – అక్టోబర్‌ 14, 2022– ఈద్‌–ఇ–మిలాద్‌–ఉల్‌–నబీ (జమ్మూ మరియు శ్రీనగర్‌) తర్వాత శుక్రవారం
    – అక్టోబర్‌ 16, 2022– ఆదివారం
    – అక్టోబర్‌ 18, 2022– కటి బిహు (గౌహతి)
    – అక్టోబర్‌ 22, 2022– నాల్గవ శనివారం
    – అక్టోబర్‌ 23, 2022– ఆదివారం
    – అక్టోబర్‌ 24, 2022– కాళీ పూజ/దీపావళి
    – అక్టోబర్‌ 25, 2022– లక్ష్మీ పూజ/దీపావళి/గోవర్ధన్‌ పూజ (గ్యాంగ్‌టక్, హైదరాబాద్, ఇంఫాల్, జైపూర్‌)
    – అక్టోబర్‌ 26, 2022– గోవర్ధన్‌ పూజ/భాయ్‌ దూజ్‌/దీపావళి/విక్రమ్‌ సంవంత్‌ న్యూ ఇయర్‌ డే (అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, డెహ్రాడూన్, గాంగ్‌టక్, జమ్ము, కాన్పూర్, లక్నో, ముంబై, నాగ్‌పూర్, సిమ్లా, శ్రీనగర్‌)
    – అక్టోబర్‌ 27, 2022– భాయ్‌ దూజ్‌/లక్ష్మీ పూజ/దీపావళి (గ్యాంగ్‌టక్, ఇంఫాల్, కాన్పూర్, లక్నో)
    – అక్టోబర్‌ 30, 2022– ఆదివారం
    – అక్టోబర్‌ 31, 2022– సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ పుట్టినరోజు/సూర్య పష్టి దాలా ఛత్‌/ఛత్‌ పూజ (అహ్మదాబాద్, పాట్నా, రాంచీ)

    Tags