New Traffic Rules In Hyderabad: హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో కొత్త ట్రాఫిక నిబంధనలు విధించనున్నారు. ఇప్పటికే వినియోగదారుల జేబులు గుళ్ల అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్త నిబంధనలు తీసుకురావంతో ప్రయాణికులకు మరింత శిరోభారం పెరగనుంది. ట్రాఫిక్ నిబంధనలు ప్రభుత్వం నిర్దేశించనుంది. దీంతో ప్రజల్లో భయం పట్టుకుంది. ఇప్పటికే హెల్మెట్ నిబంధనలతో జేబులు ఖాళీ చేసుకుంటున్న వినియోగదారులకు కొత్త నిబంధనలు కఠినతరం కానున్నాయి. రూల్స్ అతిక్రమిస్తే జేబుకు చిల్లులు పడటం ఖాయం కావడంతో జాగ్రత్తగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.

అక్టోబర్ 3 నుంచి నూతన నిబంధనలు అమలులోకి రానున్నాయి. నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించే విషయంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు రూల్స్ మరింత కఠినంగా చేస్తోంది. ఇందుకు గాను నిబంధనలు అతిక్రిమించే వారిపై కొరఢా ఝుళిపించనున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ గత దాటితే రూ. 100 జరిమానా విధించనున్నారు. ఇప్పటికే విధించిన నిబంధనలతోనే తలలు పట్టుకుంటుంటే కొత్తగా విధించే రూల్స్ తో ప్రజలకు మరింత కష్టాలు పెరగనున్నాయి.
లెఫ్ట్ కు ఆటంకం కలిగిస్తే రూ. వెయ్యి జరిమానా విధిస్తారు. పాదచారులకు ఇబ్బంది కలిగించేలా ఫుట్ పాత్ లపై వాహనాలు నిలిపితే రూ. 600 ఫైన్ వేస్తారు. అక్టోబర్ 3 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. గతంలో విధించిన జరిమానాలకే ప్రజల జేబులు గుల్ల అవుతుంటే ఇప్పుడు కొత్తగా నిబంధనలు తీసుకురావడంతో రోడ్డు ఎక్కితే జరిమానాలు పలకరించనున్నాయి. నగరంలో రోజురోజుకు జనాభా పెరుగుతోంది. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ట్రాఫిక్ ను అదుపు చేసేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోనున్నారు.
దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి కావడం గమనార్హం. దీంతో నగరంలో చోటుచేసుకున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కొత్త నిబంధనలు తెర మీదకు తీసుకొస్తోంది. ఇందులో భాగంగానే అక్టోబర్ 3 నుంచి అమలు కానుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా విడుదలయ్యాయి. దీంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇకపై రోడ్డెక్కితే జాగ్రత్తగా ఉండాల్సిందేనని చెబుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వాహనదారులు జర జాగ్రత్త పడాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.