కంటైనర్ నుంచి మహారాష్ట్రకు చెందిన కుంజర ముఠా సెల్‌ఫోన్‌లు చోరీ చేసినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్ల చేగుంటలో మరో చోరికి సంబంధించిన సొత్తు కూడా నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నామన్నారు. మొత్తం రూ.2.36 కోట్ల విలువైన 1,826 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, నేరానికి వినియోగించిన లారీ, కారు స్వాధీనం చేసుకున్నామన్నారు. చోరీలో 11 మంది ముఠా సభ్యులు పాల్గొన్నారన్నారు. ప్రస్తుతం ఇద్దరిని అరెస్టు చేశామని, మరో […]
కంటైనర్ నుంచి మహారాష్ట్రకు చెందిన కుంజర ముఠా సెల్‌ఫోన్‌లు చోరీ చేసినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్ల చేగుంటలో మరో చోరికి సంబంధించిన సొత్తు కూడా నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నామన్నారు. మొత్తం రూ.2.36 కోట్ల విలువైన 1,826 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, నేరానికి వినియోగించిన లారీ, కారు స్వాధీనం చేసుకున్నామన్నారు. చోరీలో 11 మంది ముఠా సభ్యులు పాల్గొన్నారన్నారు. ప్రస్తుతం ఇద్దరిని అరెస్టు చేశామని, మరో 9 మంది నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు.