మనం నిద్రపోయే సమయంలో ఎన్నో కలలు వస్తాయి. ఆ కలల్లో కొన్ని మన మనస్సుకు నచ్చే విధంగా ఉంటే మరికొన్ని కలలు మాత్రం భయంకరంగా ఉంటాయి. అయితే కలలు చాలా వరకు మన ఆలోచనలకు ప్రతిబింబాల్లా ఉంటాయి. మనం వేటి గురించి ఎక్కువగా ఆలోచిస్తామో అవే మనకు కలల రూపంలో వస్తాయి. కలలు నిజమవుతాయా…? అనే ప్రశ్న చాలామందిని వేధిస్తూ ఉంటుంది.
Also Read: మహేష్ రికార్డ్ బ్రేక్ చేసిన చరణ్ !
వాస్తవం ఏమిటంటే కలలు నిజమయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. మనం ప్రేమించే, అభిమనించే వ్యక్తి చనిపోయినట్లుగా కల వచ్చినా మెట్లపై నుంచి కింద పడుతున్నట్టు అనిపించినా ఆ కలలు నిజమయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. నిపుణులు మరణానికి సంబంధించిన కలలు వస్తున్నాయంటే మన శరీరంపై ఎక్కువగా బరువును పెడుతున్నామని గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.
అప్పులు ఎక్కువగా చేసినా, నిరుద్యోగం వల్ల బాధ పడుతున్నా వారికి ఎవరో వెంటపడి తరుముతున్నట్టు కలలు వస్తాయి. మనం మన స్థితిని కోల్పోతూ ఉంటే ప్రపంచానికి ఏదో ఉపద్రవం కలుగుతుందనే కలలు వస్తాయి. మనం ఇతరుల కంటే తెలివైన వాళ్లమనే భావనతో ఉన్న కలలు కంటే మనల్ని మనం కోల్పోతున్నామని అర్థం చేసుకోవాలి. ఇంట్లో ఒంటరిగా ఉన్నట్లు కలలు వస్తే మనం డిప్రెషన్ కు గురవుతున్నామని ఒంటరితనాన్ని అనుభవిస్తున్నామని గుర్తుపెట్టుకోవాలి.
Also Read: థియేటర్ల ఓపెనింగ్ పై రాజమౌళి షాకింగ్ కామెంట్
కారు యాక్సిడెంట్ అయినటువంటి కలలు వస్తే జీవిత భాగస్వామితో అపార్థాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. భయం, ఆందోళన ఎక్కువగా ఉంటే పరీక్ష ఫెయిల్ అయినట్లు కలలు వస్తాయి. మనం ఏదైనా కొత్త బంధాన్ని ప్రారంభిస్తున్నామంటే నగ్నంగా కలలు వస్తాయి. మన ఆలోచనలకు కలలు ప్రతిబింబాలు. మనం వేటి గురించి ఎక్కువగా ఆలోచిస్తామో అవే మనకు కలల రూపంలో వస్తాయి. అయితే కలలు కొందరికి నిజం అయితే కొందరికి మాత్రం నిజం కావు.